శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
విశాఖ..లోని షిప్ యార్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన తమ అల్లుడిని చూసేందుకు వెళ్తున్న ఓ కుటుంబంలోని ఇద్దరితో పాటు, కారు డ్రైవర్‌ని కూడా రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జలంతర కోట నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని..
విశాఖ..లోని షిప్ యార్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన తమ అల్లుడిని చూసేందుకు వెళ్తున్న ఓ కుటుంబంలోని ఇద్దరితో పాటు, కారు డ్రైవర్‌ని కూడా రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జలంతర కోట నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని, వీరు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.
పశ్చిమ్‌బెంగాల్ రాష్ట్రం ఖరగ్‌పూర్‌కు చెందిన నాగమణి(48), ఆమె కుమారులు రాజశేఖర్, ఈశ్వర రావు, ఇద్దరు కోడళ్లు పెతిలి, లావణ్య(23)లతో కలిసి శనివారం మధ్యాహ్నం హిందుస్తాన్ షిప్ యార్డ్ క్రేన్ ప్రమాదంలో మరణించిన తమ అల్లుడిని చూసేందుకు కారులో విశాఖకు బయలు దేరారు. అయితే శ్రీకాకుళం జలంతర కోట జాతీయ రహదారిపై ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగమని, లావణ్య, డ్రైవర్ రౌతు ద్వారక అక్కడిక్కడే మృతి చెందారు.
Read More:
ప్రపంచ వ్యాప్తంగా టెర్రర్ సృష్టిస్తున్న కోవిడ్ మహమ్మారి