AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలనొప్పిని లైట్ తీసుకుంటున్నారా.. ఈ విస్తుపోయే నిజాలు తెలుసుకోండి..

ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే చాలామంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఆఫీస్ టెన్షన్ అనో, నిద్ర సరిపోలేదనో పెయిన్ కిల్లర్ వేసుకుని సరిపెట్టుకుంటున్నారు. కానీ మీరు చేసే ఈ చిన్న పొరపాటే మిమ్మల్ని పెద్ద ప్రమాదంలోకి నెట్టేయవచ్చు. పదేపదే వచ్చే తలనొప్పి వెనుక హై బ్లడ్ ప్రెజర్ అనే సైలెంట్ కిల్లర్ దాగుండవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

తలనొప్పిని లైట్ తీసుకుంటున్నారా.. ఈ విస్తుపోయే నిజాలు తెలుసుకోండి..
Can High Blood Pressure Cause HeadachesImage Credit source: Getty Images
Krishna S
|

Updated on: Jun 02, 2026 | 2:26 PM

Share

ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో హై బీపీ సమస్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే బీపీ పెరిగినప్పుడు వచ్చే ప్రాథమిక లక్షణాలను చాలామంది గుర్తించలేకపోతున్నారు. వారిలో ఎక్కువమంది తరచుగా తలనొప్పితో బాధపడుతుంటారు, కానీ దానిని సాధారణ అలసట, ఆఫీస్ ఒత్తిడి లేదా నిద్రలేమి కారణంగా వచ్చినదిగా భావించి పెయిన్ కిల్లర్స్ వేసుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ పదేపదే వచ్చే తలనొప్పులు అనేవి శరీరంలోపల ఏదో పెద్ద ఆరోగ్య సమస్య ఉందనడానికి బలమైన హెచ్చరిక సంకేతం కావచ్చు. ఇది మీ రక్తపోటు ప్రమాదకరంగా పెరిగిందనడానికి ఒక ముఖ్యమైన సూచన. కాబట్టి అధిక రక్తపోటుకు, తలనొప్పులకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అధిక రక్తపోటుకు, తలనొప్పులకు మధ్య సంబంధం ఏంటి?

వైద్య నిపుణుల ప్రకారం.. ప్రతి తలనొప్పి కూడా అధిక రక్తపోటు వల్లే వస్తుందని అనుకోకూడదు. మైగ్రేన్లు, మానసిక ఒత్తిడి, శరీరంలో నీటి శాతం తగ్గడం, సరైన నిద్ర లేకపోవడం వంటి అనేక ఇతర కారణాల వల్ల కూడా తలనొప్పులు రావచ్చు. అయితే శరీరంలో రక్తపోటు సాధారణ స్థాయి కంటే విపరీతంగా పెరిగినప్పుడు, అది తలలోని రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల కొంతమందికి విపరీతమైన తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కేవలం తలనొప్పిని బట్టే మీకు అధిక రక్తపోటు ఉందని సొంతంగా నిర్ధారించుకోవడం సరికాదు. మీకు గనుక తరచుగా తలనొప్పి వస్తుంటే, దానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవడానికి ఒకసారి బీపీ పరీక్షించుకోవడం చాలా ముఖ్యం.

ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లేట్ చేయొద్దు..

మీకు తరచుగా తలనొప్పి రావడంతో పాటు ఈ లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా సరే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మీ బీపీని చెక్ చేయించుకోవాలి:

  • నిరంతరాయంగా వచ్చే తలనొప్పి, తలతిరగడం.
  • కంటి చూపు అకస్మాత్తుగా మసకబారడం.
  • ఛాతీలో నొప్పి లేదా భారంగా అనిపించడం.
  • కొద్ది దూరం నడిచినా శ్వాస ఆడకపోవడం.
  • రోజంతా విపరీతమైన అలసటగా అనిపించడం.
  • చేసే పనిపై ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది కలగడం.

దీనితో పాటు మీ కుటుంబంలో ఎవరికైనా ఇదివరకు అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం లేదా గుండె సంబంధిత సమస్యల చరిత్రఉంటే.. మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు ఎలాంటి లక్షణాలు లేకపోయినా క్రమం తప్పకుండా తమ రక్తపోటును పరీక్షించుకోవడం అలవాటు చేసుకోవాలి.

ఈ సైలెంట్ కిల్లర్‌ను అదుపులో ఉంచుకోవడం ఎలా?

వైద్య శాస్త్రంలో అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ప్రారంభ దశలలో ఇది గుట్టుచప్పుడు కాకుండా శరీరంలోపల ముదురుతుంది తప్ప బయటకు ఎలాంటి స్పష్టమైన లక్షణాలను చూపించదు. నిర్లక్ష్యం చేస్తే ఇది మెదడు, గుండె, కిడ్నీలను పూర్తిగా దెబ్బతీస్తుంది. దీని బారిన పడకుండా ఉండటానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.

ఉప్పు తగ్గించండి: మీ రోజువారీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. పచ్చళ్లు, అప్పడాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

ఆరోగ్యకరమైన ఆహారం: తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలి.

క్రమం తప్పని వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, రన్నింగ్ లేదా ఏదైనా శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.

ఒత్తిడి – నిద్ర: మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా మెడిటేషన్ చేయాలి. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలి.

చెడు అలవాట్లకు నో: ధూమపానం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవడం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మందుల వాడకం: ఒకవేళ మీకు ఇప్పటికే బీపీ ఉన్నట్లయితే, డాక్టర్ సూచించిన మందులను ఒక రోజు కూడా మిస్ చేయకుండా క్రమం తప్పకుండా వేసుకోవాలి.

Follow Us
తలనొప్పిని లైట్ తీసుకుంటున్నారా.. ఈ విస్తుపోయే నిజాలు తెలుసుకోండి
తలనొప్పిని లైట్ తీసుకుంటున్నారా.. ఈ విస్తుపోయే నిజాలు తెలుసుకోండి
3 నెలలకు ఒకసారి అకౌంట్లోకి డబ్బులు.. ఈ స్కీమ్ గురించి తెలుసా..?
3 నెలలకు ఒకసారి అకౌంట్లోకి డబ్బులు.. ఈ స్కీమ్ గురించి తెలుసా..?
నిరుద్యోగులకు అలర్ట్.. RRB రైల్వే రాత పరీక్షల 2026 తేదీలు మారాయ్‌
నిరుద్యోగులకు అలర్ట్.. RRB రైల్వే రాత పరీక్షల 2026 తేదీలు మారాయ్‌
శరీరంలో కొవ్వు తగ్గడానికి రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?
శరీరంలో కొవ్వు తగ్గడానికి రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?
అయ్యో తేజశ్రీ.. ఉయ్యాల చీరే ఉరి తాడైంది.. సంతోషంగా ఆడుకుంటూ..
అయ్యో తేజశ్రీ.. ఉయ్యాల చీరే ఉరి తాడైంది.. సంతోషంగా ఆడుకుంటూ..
ఆర్సీబీలో తోపు అతనే.. కోహ్లీ కానే కాదు..: వెంకటేష్ అయ్యర్
ఆర్సీబీలో తోపు అతనే.. కోహ్లీ కానే కాదు..: వెంకటేష్ అయ్యర్
పండు ఒక్కటే.. బెనిఫిట్స్ మాత్రం బోలెడు.. రోజూ ఒక్కటి తింటే..
పండు ఒక్కటే.. బెనిఫిట్స్ మాత్రం బోలెడు.. రోజూ ఒక్కటి తింటే..
పవన్ కల్యాణ్‌ను సినిమా నటుడిగానే చూస్తాం: టీపీసీసీ చీఫ్
పవన్ కల్యాణ్‌ను సినిమా నటుడిగానే చూస్తాం: టీపీసీసీ చీఫ్
మహిళలు ఏడాదికి ఒక్కసారైనా ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే..
మహిళలు ఏడాదికి ఒక్కసారైనా ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే..
2 ఏళ్లకే రూ.12 కోట్లతో వైభవ్‌కు దిమ్మతిరిగే ఆఫర్..!
2 ఏళ్లకే రూ.12 కోట్లతో వైభవ్‌కు దిమ్మతిరిగే ఆఫర్..!