ప్ర‌పంచ వ్యాప్తంగా టెర్ర‌ర్ సృష్టిస్తున్న కోవిడ్‌ మ‌హ‌మ్మారి

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే...

ప్ర‌పంచ వ్యాప్తంగా టెర్ర‌ర్ సృష్టిస్తున్న కోవిడ్‌ మ‌హ‌మ్మారి
Follow us

| Edited By:

Updated on: Aug 02, 2020 | 11:35 AM

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న‌ విష‌యం తెలిసిందే. కాగా గ‌త 24 గంట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 2,67,008 కోవిడ్‌ కేసుల సంఖ్య న‌మోద‌వ్వ‌గా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,80,25,812కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 6,88,961 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ప్రస్తుతం 60,03,547 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,20,22,265 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4764318కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 157898 మంది మృతి చెందారు. అలాగే 22,43,517 యాక్టీవ్ కేసులు ఉండగా, 23,62,903 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.

అలాగే భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 54,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,50,723కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,67,730 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 11,45,629 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 853 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన‌పడి 37,364 మంది మరణించారు.

30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ