AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jupiter Transit 2026: కర్కాటక రాశిలో గురువు.. ఆ విషయాల్లో వారు కాస్త జాగ్రత్త..!

Guru Transit 2026: జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో గురుడు సంచరించనున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు లభించనున్నాయి. అయితే వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబం, సంతానం, గృహ సంబంధిత విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 02, 2026 | 1:36 PM

Share
జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో గురువు సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మహర్దశ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ అయిదు రాశుల వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు కొన్ని రాశులకు దుస్థానాల్లో ఉండడం వల్ల వీరికి కొన్ని కష్టనష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు గురువు రాశి మార్పు వల్ల పెద్దగా కలిసి వచ్చే అవకాశం లేదు. వీరికి మిశ్రమ ఫలితాలు మాత్రమే అనుభవానికి వస్తాయి. ఆర్థిక, సంతాన, గృహ, జీవనం వంటి విషయాల్లో వీరు కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

1 / 6
వృషభం: ఈ రాశికి తృతీయ స్థానంలో గురు సంచారం వల్ల సాధారణంగా విదేశాల్లో గానీ, దూర ప్రాంతంలో గానీ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల్లో రికార్డులు సృష్టిస్తాయి. అయితే, ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. పొదుపు చేసే అవకాశం ఉండదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసర పరిచయాలు కలుగుతాయి. వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువుల వల్ల అపనిందల పాలయ్యే అవకాశం ఉంటుంది.

2 / 6
సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో గురువు ఉచ్ఛ స్థాయి సంచారం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే, ఆస్తిపాస్తుల సమస్యలు తలెత్తుతాయి. బంధువులతో అకారణ వైరాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితంలో ప్రశాంతత బాగా తగ్గే అవకాశం ఉంది.

3 / 6
తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురువు ఉచ్ఛ సంచారం వల్ల హంస మహా పురుష యోగం కలుగుతుంది. దీనివల్ల ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. అయితే, కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించకపోవచ్చు. పైగా కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా కావడం జరుగుతుంది. కుటుంబ కలహాలు పెరుగుతాయి. అసంతృప్తి బాగా ఎక్కువగా ఉంటుంది.

4 / 6
ధనుస్సు: రాశ్యధిపతి గురువు అష్టమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది.  దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గే అవకాశం ఉంది. జీవిత భాగస్వామిని అనారోగ్యాలు బాధించవచ్చు. ఆదాయాన్ని మించి ఖర్చులుంటాయి. అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడతారు.

5 / 6
కుంభం: ఈ రాశికి షష్ట స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల ఉద్యోగ జీవితంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. అయితే, జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. ఎడబాటుకు కూడా అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని దుర్వార్తలు వింటారు.

6 / 6
Follow Us