Thief Died: గంజాయి మత్తులో దొంగతం.. కిందికి దిగుతున్నానని.. మూడంతస్తుల మేడపైనించి దూకేశాడు.. కట్ చేస్తే..!
ఇదే దొంగతనానికి అసలు సమయమని అర్థరాత్రి ఇంట్లోకి చొరబడ్డాడు. రావడంతోనే కంటికి కనిపించిన డబ్బులు, పర్సు, ఫోన్లు కొట్టేశాడు. అంతా ఓకే అని అనుకున్నాడు. తాను అనుకున్న టార్గెట్‌కు చేరుకున్నాడు. ఇక నెమ్మదిగా...
ఇదే దొంగతనానికి అసలు సమయమని అర్థరాత్రి ఇంట్లోకి చొరబడ్డాడు. రావడంతోనే కంటికి కనిపించిన డబ్బులు, పర్సు, ఫోన్లు కొట్టేశాడు. అంతా ఓకే అని అనుకున్నాడు. తాను అనుకున్న టార్గెట్‌కు చేరుకున్నాడు. ఇక నెమ్మదిగా జారుకుందామని అనుకున్నాడు.. ఇంతలోనే ఏదో సౌండ్ వచ్చింది. ఇక అంతే పరగులు పడదామనుకున్నాడు చిల్లరదొంగ. పక్కా ప్లానింగ్ లేక పోవడంతో మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఇంకే ముంది క్షణాల్లో మృత్యువాత పడ్డాడు. దొంగతనం చేసే ముందు తాను తీసుకున్న గంజాయి మత్తు ఒంటి నిండా పట్టేయడంతో ఏం చేస్తున్నాడో తెలియక దూకేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగ వంట్లోను, జేబులోనూ గంజాయి సరుకు ఉంది. మత్తులో ఉంటే మనకేమీ అవుతుంది లే అనుకున్నాడేమో.. చోరీకి వచ్చినవాడు వచ్చినట్టుగా వెళితే మృతి చెందేవాడు కాదేమో అంటున్నారు స్థానికులు..
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా సాలూరులో ఈ ఘటన జరిగింది. సాలూరు వెంకటేశ్వరకాలనీలో స్థానికంగా ఉండే రామేశ్వర్ రావు ఇంట్లో అంతా నిద్రిస్తున్న సమయంలో లోపలికి వచ్చాడు. గంజాయి మత్తులో నిషా తలకెక్కి ఉన్నాడు. కనబడ్డ వస్తువులు కాజేశాడు. ఇంట్లో నుంచి ఏదో అలికిడి వచ్చింది. అలర్టై అక్కడి నుంచి పారిపోవాలనుకున్నాడు. వచ్చినదారే వెళ్లితే దొరికిపోతా అనుకున్నాడు ఆ బుచోడు. మూడో కంటికి తెలియకుండా జంప్ కావాలనుకున్నాడు. వెంటనే ఆదే ఫ్లోర్ నుండి కిందకు దూకేసాడు. అక్కడిక్కడే రక్తపు మడుగులో మృతి చెందాడు. తెల్లారితే కానీ వాడ్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. దొంగ పరిస్థితిపై స్థానికులు ఇంటి ఓనర్ రామేశ్వర్‌రావుకు విషయాన్ని చెప్పారు.
చనిపోయిన దొంగ గురించి వివరాలు సేకరిస్తున్నామని.. ఎక్కడినుండి వచ్చాడు… ఘటన ఎలా జరిగింది.. అనే దానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు స్థానిక సాలూరు పోలీసులు. చిన్న దొంగతనం చేస్తే, వచ్చిన సొమ్ముతో ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. కానీ చివరకీ ప్రాణాలే వదిలాడు.