Vijayawada: దారుణం.. భర్త పెట్టే బాధలు భరించలేక కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజమే. కానీ ఆ గొడవలు తీవ్రతరమై ఒకరినొరకు చంపుకనే పరిస్థితలు కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. ఈ హత్యల్లో అభం శుభం తెలియని పిల్లలు చివరికి అనాథలుగానో హంతకులు గానో మిగిలిపోతున్నారు.
భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజమే. కానీ ఆ గొడవలు తీవ్రతరమై ఒకరినొరకు చంపుకనే పరిస్థితలు కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. ఈ హత్యల్లో అభం శుభం తెలియని పిల్లలు చివరికి అనాథలుగానో హంతకులు గానో మిగిలిపోతున్నారు. తాజాగా బెజవాడలో జరిగిన సంఘటన కూడా ఇదే కోవలోకి వస్తుంది. భర్త పెట్టే బాధలు భరించలేక కన్న పిల్లలతో కలిసి భర్తను హత్య చేసింది భార్య. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన సురేశ్ కు అరుణ అనే మహిళతో మూప్పై ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు మగపిల్లలు. పెద్ద కొడుకు ఐదేళ్ల క్రితమే ఇంట్లోంచి వెళ్లిపోయి ట్రాన్స్ జెండర్ గా మారిపోయాడు. ఇక చిన్న కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. అయితే పెళ్లైన కొద్ది కాలం నుంచే సురేష్, అరుణలో మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉండేవి. భార్య ఎప్పడు ఎదో ఒకటి అంటుందని, అడుగుతుందని సురేష్ తాగొచ్చి ఆమెతో గొడవపడుతుండేవాడు.
అయితే ఐదేళ్ల క్రతం పెద్ద కొడుకు వినీత్ అలియాస్ రోజా ట్రాన్స్ జెండర్ గా మారిపోయాక వీరి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. చిన్నతనం నుంచే పెద్ద కొడుకుని ఆడవాళ్లు చేసే పనులు చేయించడం వల్లే అతను ట్రాన్స్ జెండర్ గా మారిపోయాడని సురేశ్ ఆమెతో ప్రతిసారి వాగ్వాదం పెట్టుకునేవాడు. వినీత్ ఆరునెలలకొకసారి ఇంటికి వస్తుండేవాడు. అలా వచ్చిన ప్రతిసారి కూడా వారిమధ్య గొడవలు ఆగేవి కాదు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వినీత్ ఇంటికి రావడంతో అతనికి తన తండ్రితో గొడవైంది. దీంతో వినీత్ తండ్రిని కొట్టి వెళ్లిపోయాడు. సాయంత్రం మళ్లీ సురేష్ తన భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఈ గొడవలో చిన్న కొడుకు ఆకాశ్ కూడా జోక్యం చేసుకున్నాడు. తల్లి అరుణ, కొడుకు ఆకాశ్ లు కలిసి సురేష్ ను కొట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం సురేష్ సోదరుడు రమేశ్ కు ఫోన్ చేశారు. సురేష్ కిందపడిపోయాడని ఎంతలేపిన లేవడం లేదని చెప్పారు. రమేశ్ ఇంటికి వచ్చి చూసేసరికీ విగతజీవిగా ఉన్న తన సొదరుడ్ని చూసి మీరే చంపేసి ఉంటారని ఆరోపించాడు. అనంతరం పోలీసుల ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులకు తల్లి, కొడుకు హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి