Andhra Pradesh: మాజీ ఆర్మీ జవాన్ ఇంట్లో దొరికిన వస్తువులు చూసి పోలీసులే షాక్!

ఒకప్పుడు దేశానికి ఎంతో సేవ చేశాడు. రిటైర్మెంట్ తీసుకుని దేశానికి సేవ చేసిన గౌరవంతో మిగిలిన జీవితాన్ని గడపాల్సిన ఆర్మీ జవాను కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు మాజీ ఆర్మీ జవాన్ గుట్టురట్టు చేశారు. భారీగా మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అతగాడిని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది.

Andhra Pradesh: మాజీ ఆర్మీ జవాన్ ఇంట్లో దొరికిన వస్తువులు చూసి పోలీసులే షాక్!
Liqour Seized
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 26, 2024 | 7:45 AM

ఒకప్పుడు దేశానికి ఎంతో సేవ చేశాడు. రిటైర్మెంట్ తీసుకుని దేశానికి సేవ చేసిన గౌరవంతో మిగిలిన జీవితాన్ని గడపాల్సిన ఆర్మీ జవాను కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు మాజీ ఆర్మీ జవాన్ గుట్టురట్టు చేశారు. భారీగా మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అతగాడిని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది.

అనంతపురం పట్టణానికి చెందిన రిటైర్డ్ బిఎస్ఎఫ్ జవాన్ హనుమంతరెడ్డి. డబ్బు కోసం అక్రమ మధ్యం వ్యాపారం మొదలు పెట్టాడు. మాజీ సైనిక ఉద్యోగిగా ఆర్మీ క్యాంటీన్‌లో తన కోటా కిందకు వచ్చే ఆరు మధ్యం బాటిళ్ళను కొనుగోలు చేసి బ్లాక్‌లో విక్రయాలు ప్రారంభించాడు. దీంతో డబ్బుపై మరింత మోజు పెరిగి, తన తోటి రిటైర్డ్ ఉద్యోగస్తుల నుంచి మరికొన్ని మద్యం బాటిల్స్ కూడా కొనుగోలు చేసి ఇంట్లోనే దుకాణం తెరిచాడు.. కేవలం డిఫెన్స్ మందు కావాలనే మందు బాబులకు ఎక్కువ రేటుకు మద్యం విక్రయిస్తున్నాడు.

గుట్టుచప్పుడు కాకుండా డిఫెన్స్ లిక్కర్ బాటిళ్ళను విక్రయిస్తున్నాడు అన్న పక్కా సమాచారంతో అనంతపురం సెబ్ పోలీసులు హనుమంతరెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించారు. దాదాపు 303 డిఫెన్స్ లిక్కర్ బాటిల్స్ హనుమంతరెడ్డి ఇంట్లో పోలీసులు గుర్తించారు. డిఫెన్స్ లిక్కర్ బాటిల్స్ విలువ దాదాపు రూ. 5.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆర్మీ జవానుగా దేశం కోసం పనిచేసిన హనుమంతరెడ్డి రిటైర్ అయ్యాక ఇదేం పాడు పని అంటున్నారు అందరూ..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…