AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamareddy: జిల్లా ఆస్పత్రిలో దారుణం.. ప్రసవం చేసేందుకు నిరాకరణ.. కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా..

లక్షలకు లక్షలు పోసి ప్రైవేటులో చికిత్స పొందలేని పేదలు గవర్నమెంట్ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తుంటారు. వారికి చికిత్స చేసి, అన్ని సౌకర్యాలు అందించాల్సిన సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారు. ప్రాణాలు...

Kamareddy: జిల్లా ఆస్పత్రిలో దారుణం.. ప్రసవం చేసేందుకు నిరాకరణ.. కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా..
Kamareddy Govt Hospital
Ganesh Mudavath
|

Updated on: Nov 30, 2022 | 9:02 AM

Share

లక్షలకు లక్షలు పోసి ప్రైవేటులో చికిత్స పొందలేని పేదలు గవర్నమెంట్ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తుంటారు. వారికి చికిత్స చేసి, అన్ని సౌకర్యాలు అందించాల్సిన సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారు. ప్రాణాలు కాపాడండీ.. అని వేడుకుంటున్నా కనికరించడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. సమయానికి డాక్టర్లు లేకపోవడం, ఉన్నా వైద్యం చేయకపోవడం, సదుపాయాలు తగినంత లేకపోవడం, మందుల కొరత, సిబ్బంది వేధింపులు, డబ్బుల కోసం డిమాండ్ వంటి వాటికి ప్రభుత్వ ఆస్పత్రులు కేరాఫ్ గా మారుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటన ఈ విషయాన్నే నిరూపిస్తోంది. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ పట్ల వైద్యులు వ్యవహిరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గర్భిణీకి జ్వరంగా ఉండటంతో ఆమెకు వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. అంతే కాకుండా ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆమెను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా.. కవల పిల్లలకు జన్మనిచ్చింది.

కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని అడ్లూరు గ్రామానికి చెందిన రోజా.. నిండు గర్భిణీ.. నెలలు పూర్తి కావడంతో ప్రసవం కోసం జిల్లా ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు స్కానింగ్‌ చేసి, కవలలు ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో రోజాకు జ్వరంగా ఉంది. దీంతో ఆమెకు వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. ఆమెను నిజామాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్ల మాటతో అవాక్కైన ఆ కుటుంబసభ్యులు.. ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్లాలంటే కష్టమని వేడుకున్నారు. ఇక్కడే ప్రసవం చేయాలని కోరారు. అయినా వైద్యులు కనికరించలేదు. దీంతో ఏమీ చేయలేని స్థితిలో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.

Kamareddy Hospital

Kamareddy Hospital

Kamareddy Hospital 1

Kamareddy Hospital 1

కాగా.. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం వస్తే చికిత్స చేయకుండా తిప్పించారని మండిపడ్డారు. జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. హై రిస్క్ కేసుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో రిఫర్ చేశామని ఆసుపత్రి వైద్యులు చెప్పడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..