Palakollu murder: పాలకొల్లులో దారుణం .. అద్దె అడిగినందుకు ఓనర్‌ను కిరాతకంగా చంపేశాడు

Palakollu murder: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం  చోటుచేసుకుంది. ఇంటి అద్దె అడిగాడని యజమానిని చంపేశాడో వ్యక్తి.  పాలకొల్లు ముచ్చర్లవారివీధిలో ఈ  దారుణ ఘటన జరిగింది.

Palakollu murder: పాలకొల్లులో దారుణం .. అద్దె అడిగినందుకు ఓనర్‌ను కిరాతకంగా చంపేశాడు
Murder
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 02, 2021 | 12:44 PM

 Palakollu murder:  పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం  చోటుచేసుకుంది. ఇంటి అద్దె అడిగాడని యజమానిని చంపేశాడో వ్యక్తి.  పాలకొల్లు ముచ్చర్లవారివీధిలో ఈ  దారుణ ఘటన జరిగింది. ఇంటి అద్దె అడిగాడన్న కోపంతో ఓనర్ వంగా ప్రసాద్​ను.. కిరాయికి ఉన్న వ్యక్తి అడపా చినకొండయ్య కిరాతకంగా హతమార్చాడు. తన  ముచ్చర్లవారివీధిలోని వంగా ప్రసాద్‌ (50) ఇంట్లో ఏడాది కాలంగా చినకొండయ్య తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. చినకొండయ్య రెండు నెలలుగా ఇంటి అద్దె కట్టడం లేదు.

ఈ విషయమై ఇంటి ఓనర్, చిన కొండయ్య మధ్య సోమవారం రాత్రి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన   చినకొండయ్య పక్కనే ఉన్న రాయితో ఓనర్‌ తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై ప్రసాద్ స్పాట్‌లోనే మృతిచెందాడు. అనంతరం చినకొండయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వికారాబాద్‌లో దారుణ హత్య…

వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట్‌ మండలం మెట్లకుంటలో దారుణం జరిగింది.  కుర్వ చంద్రయ్య(52)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. డెడ్‌బాడీ చూసిన స్థానికలు కంగుతిన్నారు. హత్య దుండగులు తల, మొండెంను వేరు చేశారు. తలను చెరువులో, మొండెంను పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో విసిరేశారు. ఆదివారం పొలం పనులకు వెళ్లిన చంద్రయ్య తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కంగారుపడిన అతని కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. గాలింపు చేపట్టిన పోలీసులు మెట్లకుంట ఎల్లమ్మ చెరువు వద్ద చంద్రయ్య డెడ్‌బాడీని గుర్తించారు. ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. చంపివ విధానాన్ని బట్టి చూస్తే .. మనసులో బాగా కక్ష పెట్టుకుని ప్లాన్ చేసి మరీ మర్డర్ చేసినట్లు అర్థమవుతుంది. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది.

చిన్న కారణాలకే హత్యలు:

క్షణికావేశంలో చేసిన హత్యలు కుటుంబాల పాలిట శాపంగా మారుతున్నాయి. బాధితులు కుటుంబాలు, నిందితుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ తరహా చర్యలు ఆ కుటుంబాల భవిష్యత్ తరాలకు కూడా ఇబ్బందిగా మారుతున్నాయి.

Also Read:

సినిమా షూటింగ్‌‌లో పేలిన పెట్రోల్ బాంబులు.. ప్రముఖ హీరోకు గాయాలు

ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌కు పోలీసులు కౌన్సిలింగ్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు యాక్సిడెంట్ కేసు కూడా !