Shanmukh Jaswanth: ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌కు పోలీసులు కౌన్సిలింగ్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు యాక్సిడెంట్ కేసు కూడా !

Shanmukh Jaswanth Arrest: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌రు 10లో శనివారం రోడ్డు ప్రమాదం సంభ‌వించిన విషయం తెలిసిందే. యూట్యూబ్ ఫేమ్‌, టిక్‌టాక్ స్టార్...

Shanmukh Jaswanth: ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌కు పోలీసులు కౌన్సిలింగ్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు యాక్సిడెంట్ కేసు కూడా !
Follow us

|

Updated on: Mar 02, 2021 | 12:54 PM

Shanmukh Jaswanth Accident Case:  హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌రు 10లో శనివారం రోడ్డు ప్రమాదం సంభ‌వించిన విషయం తెలిసిందే. యూట్యూబ్ ఫేమ్‌, టిక్‌టాక్ స్టార్ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ న‌డుపుతున్న కారు అదుపుత‌ప్పి మ‌రో రెండు కార్లు, రెండు బైక్‌ల‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. షణ్ముఖ్‌ జశ్వంత్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా.. 170 రీడింగ్ వచ్చింది. ఐపీసీ సెక్షన్ 337, 279 కింద పోలీసులు కేసు నమోదదు చేశారు. అతడికి డ్రంక్ డ్రైవ్‌కు సంబంధించిన కేసు మాత్రమే కాకుండా.. యాక్సిడెంట్‌కు సంబంధించిన కేసు కూడా నమోదు చేశారు. కాగా షణ్ముఖ్‌కు త్వరలో పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు పోలీసులు. మున్ముందు చాలా భవిష్యత్ ఉందని, ఇటువంటి చర్యల వల్ల సమాజంలో పలచనపోతారనే విషయాన్ని వెల్లడించనున్నారు. సెలబ్రిటీగా ఉన్న క్రమంలో అతడికి కౌన్సిలింగ్ డోస్ కాస్త ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా యాక్సిడెంట్ అనంతరం షణ్ముఖ్ వ్యవహరించిన తీరు, స్టేషన్‌ ప్రవర్తనల నేపథ్యంలో పద్దతి మార్చుకోమని చెప్పే అవకాశం ఉంది.

స్టేషన్‌కు తీసుకెళ్లగా‌ పలువురు పెద్దలతో  పోలీసులకు ఫోన్లు చేయించేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా సమాచారం. పోలీసులు అందుకు వీలుకాదని చెప్పినా కూడా వినకుండా.. కాస్త అతిగా ప్రవర్తించాడట. తప్పతాగి రెండు కార్లు, రెండు బైక్‌ల‌ను ఢీకొట్టడమే కాకుండా.. ”ఎవరికీ దెబ్బలు తగలలేదు కదా.. హాస్పిటల్‌లో కూడా జాయిన్ కాలేదు” అని అతడు తిరిగి ప్రశ్నించడం గమనార్హం.

కాగా, షణ్ముఖ్‌ జశ్వంత్ ‘వైవా’,  ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అటు ‘సూర్య’ అనే మరో వెబ్ సిరీస్‌ను షణ్ముఖ్‌ జస్వంత్ ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశాడు. ఈ రెండు సిరీస్‌లు కోట్లలో వ్యూస్ రాబడుతున్నాయి. అంతేకాదు.. తెలుగు హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ కవర్ చేస్తూ కూడా గుర్తింపు పొందాడు. యూట్యూబ్‌లో షణ్ముక్ ఫాలోవర్స్ దాదాపు మూడు కోట్ల మంది ఉన్నారంటే అతని ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, తాజాగా షణ్ముక్ బిగ్ బాస్ ఫేమ్ దీప్తీ సునైనాతో ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో ఓ  వినోద కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఆమెతో ప్రేమ ప్రయాణం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:

అపార్ట్‌మెంట్‌లో మంటలు.. తల్లడిల్లిన తల్లి గుండె.. బిడ్డల్ని కిటికీలోనుంచి

సినిమా షూటింగ్‌‌లో పేలిన పెట్రోల్ బాంబులు.. ప్రముఖ హీరోకు గాయాలు

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..