ఎం.జె.అక్బర్ కేసు, ఢిల్లీ కోర్టు తీర్పుపై అప్పీలు చేస్తాం, లాయర్ గీతా లూథ్రా, తీర్పు 87 వ పేజీలో ఏముందో చూడండి
మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ కేసులో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అప్పీలు దాఖలు చేస్తామని ఆయన తరఫు లాయర్ గీతా లూథ్రా ప్రకటించారు.

మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ కేసులో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అప్పీలు దాఖలు చేస్తామని ఆయన తరఫు లాయర్ గీతా లూథ్రా ప్రకటించారు. ఈ తీర్పు పూర్తి పాఠం లోని 87 వ పేజీలో తమ క్లయింటుకు పూర్తి అనుకూల ప్రస్తావన ఉందని ఆమె చెప్పారు తనపై జర్నలిస్టు ప్రియా రమణి దురుద్దేశపూరితంగా, తన ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఆరోపణలు చేసిందంటూ అక్బర్ ఆమెపై క్రిమినల్ డిఫమేషన్ దావాను దాఖలు చేశారు. అయితే ఆ దావాను ఢిల్లీ కోర్టు తిరస్కరిస్తూ.. ఈ కేసులో ప్రియా రమణిని నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు 87 వ పేజీలో ఉన్న ప్రస్తావన ప్రకారం.. ప్రియా రమణి వాదన సరికాదని, దాన్ని జడ్జి తోసిపుచ్చారని గీతా లూథ్రా పేర్కొన్నారు. (ఈ కేసులో జడ్జి మొత్తం 92 పేజీల తీర్పును వెలువరించారు) .కేసు విచారణ జరుగుతుండగా ట్విటర్ హ్యాండిల్ ను ఒకరు డిలీట్ చేయజాలరని, తన ట్రయల్ (విచారణ) పెండింగులో ఉన్న సమయంలో రమణి తన ట్విటర్ ఖాతాను డిలీట్ చేసిన అంశాన్ని ఈ వెర్డిక్ట్ ప్రస్తావించలేదన్నారు.
రమణి వాదన తప్పులతడకగా ఉంది.. అసలు అంశాలను ఆమె టాంపర్ చేసింది.. ఈ విషయాన్నీ తీర్పు అసలు టచ్ చేయలేదు..అని ఆమె పేర్కొన్నారు. నా క్లయింటు (అక్బర్) పై సోషల్ మీడియా కూడా దాడి చేసిందని ఆమె ఆరోపించారు. గత 40-50 ఏళ్లుగా ఎలాంటి మచ్చ లేని ఆయనను కావాలనే ‘మీ టూ ఉద్యమ’మనే పేరిట దాదాపు వేధించారు అని గీతా లూథ్రా విమర్శించారు. ఏ విధమైన ఆధారాలు లేనిదే ఒక వ్యక్తి మీద సోషల్ మీడియాకు ఎక్కజాలరని, అలాంటి హక్కు వారికీ లేదని ఆమె చెప్పారు. ఇది ప్రమాదకరమైన ధోరణి అన్నారు. ఇందుకు ఉదాహరణగా ఆమె సుబ్రమణ్యస్వామి కేసును ప్రస్తావించారు. ఈ కేసుకు సంబంధించి 2017 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుంచుకోవాలన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :



