AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌తో దారుణం.. హత్య కేసు విచారణలో నివ్వెరపోయిన పోలీసులు

మనో వైకల్యంతో బాధపడుతున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. ఈ హత్యోదంతంపై పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌తో దారుణం.. హత్య కేసు విచారణలో నివ్వెరపోయిన పోలీసులు
Mobile Charging Cable
Janardhan Veluru
|

Updated on: Jul 24, 2021 | 1:53 PM

Share

మనో వైకల్యంతో బాధపడుతున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. ఈ హత్యోదంతంపై పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని ఆనేకల్‌‌లో నివాసముంటున్న భాగ్యమ్మ సోదరి నాగవేణి(45) గత కొన్నేళ్లుగా మనో వైకల్యంతో బాధపడుతోంది. నాగవేణి పోషణ, వైద్య చికిత్సకు భాగ్యమ్మ నెలనెలా వేలాది రూపాయలు ఖర్చుచేయాల్సి వచ్చేది. పెద్దమ్మ నాగవేణి కోసం తన తల్లిదండ్రులు భారీగా ఖర్చు చేయడం భాగ్యమ్మ తనయుడు పవన్‌కు ఏ మాత్రం నచ్చేది కాదు. పెద్దమ్మ తమ కుటుంబానికి భారంగా మారిందని తరచూ ఆమెతో పవన్ గొడవపడేవాడు. పవన్ తీరు సరిగ్గా లేదంటూ నాగమణి ఇటీవల అతని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమెపై మరింత కోపం పెంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం భాగ్యమ్మ పొరుగింటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో నాగమణి, పవన్ మాత్రమే ఉన్నారు. వారిద్దరు టీవీ చూస్తున్నారు. 15 నిమిషాల తర్వాత పవన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇంటికి తిరిగొచ్చిన భాగ్యమ్మ..బెడ్‌రూమ్‌లో నాగమణి విగతజీవిగా పడి ఉండటం చూసి షాక్‌కు గురైయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు.

పరారీలో ఉన్న పవన్‌ను పట్టుకున్న పోలీసులకు…కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. నేరం అంగీకరించిన పవన్.. ముందుగా చపాతీ కర్రతో నాగమణి తలపై కొట్టినట్లు పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత ఆమె అరుపులు బయటకు వినిపించకుండా మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌తో గొంతు నులిమి హతమార్చినట్లు అంగీకరించాడు. పెద్దమ్మ కారణంగానే తమ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, కుటుంబంలో సంతోషం లేకుండా పోయిందని..అందుకే ఆమెను హత్య చేసినట్లు తెలిపాడు. పవన్‌ను అరెస్టు చేసిన పోలీసులు..కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు మొబైల్ ఛార్జింగ్ కేబుల్ సాయంతో హత్య చేయడం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులను కూడా నివ్వెరపరిచింది.

Also Read..

కాయిన్స్‏కు బదులుగా రూపాయి నోటు.. కారణం అదే.. వంద సంవత్సరాలుగా చెలామణి..

ఇంట్లో ఒంటరిగా ఉన్న కొత్త పెళ్లి కూతురు.. పొలం పనులు పూర్తి చేసుకుని వచ్చిన అత్తమామల షాక్..!