AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karimnagar Murder: ఇంట్లో ఒంటరిగా ఉన్న కొత్త పెళ్లి కూతురు.. పొలం పనులు పూర్తి చేసుకుని వచ్చిన అత్తమామల షాక్..!

Newly Married woman Murdered: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువును అతి కిరాతకంగా హతమార్చారు. సరిగ్గా పెళ్లైన మూడు నెలలకే గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి చంపేశారు.

Karimnagar Murder: ఇంట్లో ఒంటరిగా ఉన్న కొత్త పెళ్లి కూతురు.. పొలం పనులు పూర్తి చేసుకుని వచ్చిన అత్తమామల షాక్..!
Newly Married Woman Brutally Murder
Balaraju Goud
|

Updated on: Jul 24, 2021 | 12:46 PM

Share

Brutally Murder: కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువును అతి కిరాతకంగా హతమార్చారు. సరిగ్గా పెళ్లైన మూడు నెలలకే గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన మ్యాదరి అనిల్‌తో హుజూరాబాద్‌కు చెందిన ప్రవళిక అనే యువతితో గత మే 21న పెళ్లి జరిగింది. ఈ క్రమంలోనే అనిల్ హుస్నాబాద్‌లో ఓ బ్యాటరీ షాపులో పని చేస్తుండగా, ప్రవళిక అత్తమామాలు ఇద్దరు వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయమే వెళ్లారు. దీంతో ప్రవళిక ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది. కాగా శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన అత్తమామాలు షాక్‌కు గురయ్యారు. తన బెడ్‌రూంలో ప్రవళిక విగతజీవిగా పడిఉండడంతో ఒక్కసారిగా గొల్లుమన్నారు. విషయం తెలిసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

అయితే, ప్రవళికను హత్య చేసే కంటే ముందు ఘర్షణ జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇతర వ్యక్తులతో వాగ్వాదం జరిగి ఉంటుందని.. దీంతో పథకం ప్రకారం దుండగులు తమ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న కరీంనగర్ పోలీసు కమీషనర్ కమలహాసన్ రెడ్డి పరీశీలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీపీ కమలహాసన్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా సంఘటన వెనక యువతికి సంబంధించిన వ్యక్తగత కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సీపీ తెలిపారు.

Read Also…

Viral Video: కరోనా వ్యాక్సీన్‌ కోసం క్యూలో నిల్చున్న మహిళలు.. అంతలో ఊహించని సీన్.. వైరల్ అవుతున్న వీడియో..