ములుగు ఏజెన్సీలో హై అలర్ట్..
ఏజెన్సీ ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. గత రెండు నెలలుగా తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఓ వైపు మావోయిస్టుల అలజడి, మరోవైపు పోలీసుల విస్తృత తనిఖీలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఏజెన్సీ ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. గత రెండు నెలలుగా తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఓ వైపు మావోయిస్టుల అలజడి, మరోవైపు పోలీసుల విస్తృత తనిఖీలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఆదివారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ములుగు జిల్లా వెంకటాపురంలో పోలీసు ఉన్నతాధికారులు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
కేంద్రహోంశాఖ సలహాదారుడు విజయ్ కుమార్ నేతృత్వంలో కో ఆర్డినేషన్ మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు భారీ సంఖ్యలో వచ్చారన్న సమాచారంతో ఈ భేటీ జరుగుతోంది. కాగా.. రెండు నెలల్లోనే డీజీపీ మహేందర్‌రెడ్డి ఇలా ఏజెన్సీలో పర్యటించడం రెండోసారి కావడం గమనార్హం.




