AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. పరీక్ష రాసేందుకు వెళ్తూ ఇద్దరు దుర్మరణం

ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిశాయి. పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను లారీ వెనుక నుంచి డీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. పరీక్ష రాసేందుకు వెళ్తూ ఇద్దరు దుర్మరణం
Balaraju Goud
|

Updated on: Oct 04, 2020 | 11:53 AM

Share

ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిశాయి. పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను లారీ వెనుక నుంచి డీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన శ్వేతా, శ్రీనివాస్‌ డైట్‌సెట్‌ పరీక్ష రాసేందుకు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రానికి బైక్‌పై వెళ్తున్నారు. మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఇద్దరు ఇద్దరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి మృతిచెందారు. కాగా, శ్వేతకు వివాహమై, ఒక బాబు కూడా ఉన్నాడు.

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే వీరిద్దరు మృత్యువాత పడినట్లు స్థానికుల తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన తమ పిల్లలు ఇక తిరిగిరాదనే చేదు నిజం వారిని విషాదంలో ముంచింది.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా