AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP-TG Weather: హమ్మయ్యా.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ జోరందుకోనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు-మెరుపులు, గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

AP-TG Weather: హమ్మయ్యా.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
AP TG Weather report
Shaik Madar Saheb
|

Updated on: Jul 23, 2026 | 12:49 PM

Share

తెలుగు రాష్ట్రాలను వరుణుడు కరుణిస్తున్నాడు. ఎల్‌నినోతో మొన్నటివరకూ అస్సలు చినుకు జాడే లేకపోగా.. ఇప్పుడు పరిస్థితి మారింది. ఏపీ, తెలంగాణలో మేఘావృతమై.. మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల కదిలికలతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అస్సలు వర్షాల్లేని పరిస్థితి నుంచి ఎల్లోఅలర్ట్‌ జారీచేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.:-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం : –

గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్;-

గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ:-

గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

తెలంగాణలో వర్షాలు

ఇక, తెలంగాణలో కూడా వానలు కురుస్తున్నాయి.. వచ్చే మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయి.. నిర్మల్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, ములుగు, వరంగల్‌, హనుమకొండ, జనగాం, నారాయణ్‌పేట్‌, వనపర్తి, గద్వాల జిల్లాలకు ప్రస్తుతం గ్రీన్‌అలర్ట్‌ కంటిన్యూ అవుతోంది. ఈ పది జిల్లాల్లో సాధారణం నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఉంది. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.

హైదరాబాద్‌ నగరమంతటా మూడ్రోజులుగా మేఘావృతమై.. చిరు జల్లులు, మోస్తరు వర్షం పడుతూనే ఉంది. ప్రస్తుతం, హైదరాబాద్‌లోని 7 జోన్లకూ ఎల్లో అలర్ట్‌ కంటిన్యూ అవుతోంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కంటోన్మెంట్‌, సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, చార్మినార్‌ జోన్లలో మోస్తరు వర్షం కురుస్తాయని చెప్పింది వాతావరణశాఖ..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us