AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం.. డ్రైవర్ కోసం..

రక్తం పంచుకుని పుట్టిన అన్నా చెన్నెళ్లే.. ఆపదలో ఉన్నారంటే.. పట్టించుకోని ఈ రోజుల్లో.. ఇక్కడో వ్యక్తి మాత్రం.. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి ఆపరేషన్ కోసం ఏకంగా రూ.4.25లక్షలు సహాయం చేసిన అతని ప్రాణాలు నిలబెట్టాడు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత.. ఆ యజమానికి చెప్పిన మాట ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అతని మాటలు విన్న నెటిజన్స్ ఆయన వ్యక్తిత్వానికి సలామ్ కొడుతున్నారు.

Viral News: బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం.. డ్రైవర్ కోసం..
Employer Funds Driver's Heart Surgery
Anand T
|

Updated on: Jul 23, 2026 | 1:04 PM

Share

చిన్నప్పటి నుంచి కనిపెంచిన తల్లిదండ్రులనే పట్టించుకోని మనుషులు ఉన్న ఈ రోజుల్లో.. తన దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఓ కంపెనీ యజమానికి స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్‌ అవుతోంది. తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని కేవలం ఒక పనివాడిగా కాకుండా, తనతో సమానమైన సహోద్యోగిగా గౌరవిస్తూ.. అతడి హార్ట్ సర్జరీ కోసం రూ. 4.25 సహాయం చేసిన ఆ యజమాని వ్యక్తిత్వానికి నెటిజన్లు అందరూ ఫిదా అయిపోతున్నారు. బాస్ అంటే ఇలా ఉండాలని ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ఓ ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ ప్రశాంత్ మిశ్రా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ ఘటన ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. డాక్టర్ మిశ్రా ప్రకారం..ఈ మధ్య కాలంలో డాక్టర్ మిశ్రా దగ్గరకు శుక్లా అనే ఓ వ్యక్తి బైపాస్ సర్జరీ కోసం వచ్చాడు. అయితే ఆపరేషన్‌కు సుమారు రూ.4.25లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పగా.. తాను కేవలం డ్రైవర్‌నేనని.. అంత డబ్బు సర్దడం తన వల్ల కాదని.. దయచేసి ఖర్చు విషయంలో కొద్దిగా సాయం చేయండి శుక్లా డాక్టర్‌ను కోరారు. అయితే డాక్టర్ కూడా తనకు వీలైనంత సహాయం చేస్తానని శుక్లాకు హామీ ఇచ్చారు.

కానీ నెస్ట్ డే మార్నింగ్ అయ్యే సరికి అందరినీ ఆశ్చర్యపరిచే పరిణామం జరిగింది. శుక్లా డ్రైవర్‌గా పనిచేస్తున్న కంపెనీ యజమానికి శుక్లా ఆపరేషన్‌కు కావాల్సిన రూ. 4.25 లక్షల పూర్తి మొత్తాన్ని నేరుగా హాస్పిటల్‌ అకౌంట్‌కు RTGS ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. డబ్బులు అందడంతో డాక్టర్‌లు కూడా అతనికి వెంటనే ఆపరేషన్ చేశారు. అయితే సర్జరీ పూర్తైన తర్వాత.. డాక్టర్ మిశ్రా.. సదురు కంపెనీ యజమానికి ఫోన్ చేసి మాట్లాడారు. సర్జరీ సక్సెస్ అయిందని చెప్పారు. అది విన్న యజమానికి తన సహ ఉద్యోగిని కాపాడినందుకు ధన్యవాదాలు అని డాక్టర్‌కు తెలిపాడు.

అయితే శుక్లా తన సహా ఉద్యోగి అని యజమానికి చెప్పిన మాటలు విన్న డాక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.. శుక్లా తాను మీ వద్ద డ్రైవర్ పనిచేస్తున్నానని.. మీరు తన బాస్ అని చెప్పాడు.. మరి మీరేమో సహా ఉద్యోగి అంటున్నారని సదురు యజమానికి డాక్టర్ ప్రశ్నించాడు.అప్పుడు యజమానికి చెప్పిన సమాధానం యావత్ మానవాలి హృదయాన్ని కదిలించింది.

డ్రైవర్ కాదు.. నా కొలీగ్

డాక్టర్ అడిగిన ప్రశ్నకు సదురు యజమానికి సమాధానం ఇస్తూ.. డాక్టర్ గారు, మేమిద్దరం కలిసి పనిచేస్తాం. అతడు గత 15 ఏళ్లుగా నాతో ఉంటున్నాడు. నేను అతడిని కేవలం డ్రైవర్‌గా మాత్రమే చూడటం లేదు. మేం ఇద్దరం కలిసి పనిచేస్తాం.. మా ఇద్దరి దైనందిన జీవితంలో పాత్రలు వేరు కావచ్చు, కానీ మేమిద్దరం కలిసి పనిచేస్తున్నామన్నారు.. అతడి పని వేరు కావచ్చు, కానీ మేమిద్దరం కొలీగ్స్‌మే! అని ఆ యజమాని ఎంతో వినయంగా చెప్పారు. అది విన్న డాక్టర్ సైతం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!