ఆస్తి కోసం ఘాతుకం: పెదనాన్నను హత్య చేసి.. సెల్ఫీ తీసుకొని..!
ఆస్తి కోసం ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. సొంత పెదనాన్న అని చూడకుండా దారుణంగా హత్య చేసి, ఆ తరువాత మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు ఆ కర్కశకుడు.
ఆస్తి కోసం ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. సొంత పెదనాన్న అని చూడకుండా దారుణంగా హత్య చేసి, ఆ తరువాత మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు ఆ కర్కశకుడు. ఈ ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. ఉట్నూర్ మండలం లక్కారం గ్రామపంచాయతీ పరిధిలోని గంగన్నపేటకు చెందిన తాళ్లపల్లి శివరాజ్ ఏఎస్‌ఐగా పనిచేసి రిటైర్ అయ్యారు. కొంతకాలంగా అతడికి, తమ్ముడు జయరాజ్ కుటుంబంతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జయరాజ్ కుమారుడు.. తన పెదనాన్న శివరాజ్‌ను దారుణంగా హత్య చేశాడు. చర్చికి వెళ్తుండగా దాడిచేసి హతమార్చాడు. ఆ తరువాత పెదనాన్న మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతుడి భార్య రోజా ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Read This Story Also: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఆ నలుగురే ఫైనల్..!