మారుతీరావు చివరి కోరికపై అమృత ఏమందంటే..

మారుతీరావు సూసైడ్ లేఖపై కూతురు అమృత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆత్మహత్యకు ముందు కూతురు అమృతను, భార్యను ఉద్దేశిస్తూ లేఖ రాశారు. ఈ లేఖలో తన భార్యను క్షమించమని కోరుతూ.. కూతురు అమృతను తల్లి వద్దకు వెళ్లమంటూ తన చివరి కోరిక తెలిపారు. మారుతీరావుకి, తమకు మధ్య ప్రణయ్‌ను చంపాడన్న కోపమే తప్ప.. వేరే గొడవలేమీ లేవన్నారు. పిల్లలంటే అందరికీ ప్రేమ ఉంటుందని.. భర్త చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో గత ఏడాదిన్నరగా అనుభవిస్తున్నానని.. ఆ […]

మారుతీరావు చివరి కోరికపై అమృత ఏమందంటే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 09, 2020 | 6:44 PM

మారుతీరావు సూసైడ్ లేఖపై కూతురు అమృత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆత్మహత్యకు ముందు కూతురు అమృతను, భార్యను ఉద్దేశిస్తూ లేఖ రాశారు. ఈ లేఖలో తన భార్యను క్షమించమని కోరుతూ.. కూతురు అమృతను తల్లి వద్దకు వెళ్లమంటూ తన చివరి కోరిక తెలిపారు.

మారుతీరావుకి, తమకు మధ్య ప్రణయ్‌ను చంపాడన్న కోపమే తప్ప.. వేరే గొడవలేమీ లేవన్నారు. పిల్లలంటే అందరికీ ప్రేమ ఉంటుందని.. భర్త చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో గత ఏడాదిన్నరగా అనుభవిస్తున్నానని.. ఆ బాధేమిటో తనకు తెలుసు కాబట్టే అమ్మను పరామర్శించడానికి వెళ్లానని తెలిపింది. కాగా.. తనకు బాబు పుట్టాక అమ్మ ఓ సారి తన దగ్గరకు వచ్చారని.. బాబును చూపించమని కోరితే తాను నిరాకరించానన్నారు. తాను ప్రణయ్ కుటుంబాన్ని వదిలి అమ్మ దగ్గరకు వెళ్లనని.. అయితే ఒకవేళ ఆమె తన దగ్గరకు వస్తే ఆమె బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. తన భర్త ఇంటికి రావడం ఇష్టం లేదంటే.. మాతో కలిసి బయట ఉంటానంటే అందుకు ఒకే చెప్తానని అమృత పేర్కొంది. తన భర్త ప్రణయ్‌ చనిపోయినప్పుడు ఎలా ధైర్యంగా ఉన్నానో.. ఇప్పుడు తండ్రి చనిపోయినా అంతే ధైర్యంగా ఉన్నాననీ స్పష్టం చేసింది.