Narendra Modi: మోదీ డ్రీమ్ టీమ్‌లో హైదరాబాదీ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

Modi Dream Team For Social Media: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ.. తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిని ప్రధాని మోదీ స్త్రీలకు అంకితమిస్తానన్న సంగతి తెలిసిందే. ఆ ఒక్క రోజు తన ఖాతాలను నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న శక్తివంతమైన మహిళలను ఎంపిక చేశారు. అందులో భాగంగానే ఏడుగురిని ఎంపిక చేయగా.. వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన కల్పనా రమేష్. అసలు ఈమె ఎవరు.? మోదీ డ్రీమ్ టీమ్‌లో ఉండటానికి గల కారణం ఏంటన్న విషయంలోకి వెళ్తే.. […]

Narendra Modi: మోదీ డ్రీమ్ టీమ్‌లో హైదరాబాదీ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 09, 2020 | 9:58 PM

Modi Dream Team For Social Media: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ.. తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిని ప్రధాని మోదీ స్త్రీలకు అంకితమిస్తానన్న సంగతి తెలిసిందే. ఆ ఒక్క రోజు తన ఖాతాలను నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న శక్తివంతమైన మహిళలను ఎంపిక చేశారు. అందులో భాగంగానే ఏడుగురిని ఎంపిక చేయగా.. వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన కల్పనా రమేష్. అసలు ఈమె ఎవరు.? మోదీ డ్రీమ్ టీమ్‌లో ఉండటానికి గల కారణం ఏంటన్న విషయంలోకి వెళ్తే.. అమెరికాలో ఉండే కల్పనా రమేష్.. పదేళ్ల క్రితం ఇండియా వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అయింది. యూఎస్‌లో స్వచ్ఛమైన నీరు ఎక్కడైనా దొరుకుతుంది. ఇది అందరికి తెలిసిన సంగతే. అలాగే ఇండియాలో కూడా ఉంటుందని భావించిన ఈమెకు షాక్ తగిలింది.

హైదరాబాద్‌లో ఆమె ఉంటున్న చోట వారానికి రెండు ట్యాంకర్ల నీళ్లు మాత్రమే వస్తాయి. అంతేకాక అక్కడ అందరూ కూడా బ్రాండెడ్ మినరల్ వాటర్‌ని తాగేవారు. ఇదంతా చూసిన కల్పన ఇదంతా ఏంటని పక్కవాళ్లను అడిగినా.. వాళ్ల దగ్గర నుంచి సరైన సమాధానం వచ్చేది కాదట. ఇక దీనికి చెక్ పెట్టాలని ఆమె ఓ నిర్ణయానికి వచ్చారు.ఆమె ఇంటి డాబాపైనే నీటిని వేస్ట్ చేయకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టారు. వానాకాలంలో పడే నీరు వృధా కాకుండా ఇంటి ఆవరణలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఇంట్లో వాడే నీటిని సైతం రీ-సైక్లింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల వాళ్ల ఇంటికి కావాల్సిన నీటిని వారే సొంతంగా ఏర్పాటు చేసుకోగలిగారు.

నెక్స్ట్ స్టెప్ కింద ఈ ప్లాన్స్‌ను ఆమె కాలనీవాసులకు కూడా చెప్పింది. కాలనీ అంతటా ఇంకుడు గుంతలు తవ్వించి.. సంరక్షణ ట్యాంకులు పెట్టించారు. అటు జీహెచ్ఎంసీ అధికారులతో మూడు నెలల పాటు అవేర్‌నెస్ ప్రోగ్రాం‌ను కూడా చేపట్టారు. హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల అవసరం లేకుండా చేయాలన్నది తన కలగా కల్పనా రమేష్ చెబుతుంటారు. అంతేకాకుండా కాలనీవాసులు ఆమెను అభిమానంతో  వాటర్ వారియర్ అని పిలుచుకునేవారు. సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్ సభ్యురాలిగా, గో గ్రీన్ కార్యకర్తగా ఈమె అందరికి సుపరిచితురాలు. నీటి ఆదాలో పలువురికి స్ఫూర్తిగా నిలిచిన ఈ హైదరాబాదీ మహిళను మోదీ ఎంపిక చేయడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం.

For More News:

‘ఆహా’కు వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. లక్షల్లో ‘వ్యూ’లు..

బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.. తల్లి ఎంట్రీ‌తో కూతురు షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

ధోనికి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్.. ఐపీఎల్‌ ఫామ్‌తోనే జట్టులోకి..?

కరోనా భయం.. కోహ్లీసేనతో నో షేక్ హ్యాండ్..

అల్లరోడుతో చందమామ రొమాన్స్..?

కరోనా ఎఫెక్ట్.. హద్దు దాటితే మూడు నెలల జైలు శిక్ష..

కొన్నిసార్లు మన కళ్లే మోసం చేస్తాయట.. దొరబాబు భార్య సందేశం

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో 17 రోజులు మద్యం దుకాణాలు బంద్..

దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి…