AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెరపైకి నిర్భయ దోషి.. శిక్ష తగ్గించాలంటూ పిటిషన్.. కోర్టులో కాకుండా.. ఈ సారి..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో దోషులకు పడ్డ ఉరిశిక్షపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిసారి చివరి నిమిషంలో కొత్త కొత్త పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలు పెట్టుకుంటూ.. ఉరితీత వాయిదా పడేలా చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా నాలుగోసారి డెత్ వారెంట్‌ను ఢిల్లీలోని పటియాల కోర్ట్ జారీ చేసింది. మార్చి 20వ […]

తెరపైకి నిర్భయ దోషి.. శిక్ష తగ్గించాలంటూ పిటిషన్.. కోర్టులో కాకుండా.. ఈ సారి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 09, 2020 | 6:23 PM

Share

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో దోషులకు పడ్డ ఉరిశిక్షపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిసారి చివరి నిమిషంలో కొత్త కొత్త పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలు పెట్టుకుంటూ.. ఉరితీత వాయిదా పడేలా చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా నాలుగోసారి డెత్ వారెంట్‌ను ఢిల్లీలోని పటియాల కోర్ట్ జారీ చేసింది. మార్చి 20వ తేదీ తెల్లవారుజామున 5.30 గంటలకు ఉరితీయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ డెత్ వారెంట్‌ను యావజ్జీవంగా మార్చాలంటూ నిర్భయ దోషి వినయ్ శర్మ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్ బైజల్‌కు పిటిషన్ పెట్టుకున్నాడు. తన మరణ శిక్షను యావజ్జీవ కారాగారా శిక్షగా మార్చాలని.. జైల్లో ఉన్న సమయంలో తనలో మార్పును గమనించాలని.. దాన్ని పరిగణలోకి తీసుకుని శిక్ష తగ్గించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు. కాగా.. ఇప్పటికే న్యాయపరంగా అన్ని దారులు మూసుకుపోవడంతో.. మార్చి 20న ఉరిశిక్ష పడుతుందన్న ఆశాభావంతో నిర్భయ తల్లి ఆశాదేవి వేచిచూస్తోంది.

Follow Us
షమీ, మోహ్సిన్ ధాటికి రాజస్థాన్ విలవిల..లక్నో ముందు స్వల్ప లక్ష్యం
షమీ, మోహ్సిన్ ధాటికి రాజస్థాన్ విలవిల..లక్నో ముందు స్వల్ప లక్ష్యం
OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
ప్రూఫ్ లేకున్నా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త రూల్ ఇదే..
ప్రూఫ్ లేకున్నా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త రూల్ ఇదే..
పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!
పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!
బాబీ సినిమాలో గ్లామరస్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా.. !!
బాబీ సినిమాలో గ్లామరస్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా.. !!
తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో న
తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో న
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.?
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.?
వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్
వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్
రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి
రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి
వేసవి వేడిలో పక్షులకు వరం.. విద్యార్థుల వినూత్న చర్య
వేసవి వేడిలో పక్షులకు వరం.. విద్యార్థుల వినూత్న చర్య