AP Crime: ఉపాధ్యాయుడి అనుచిత ప్రవర్తన.. విద్యార్థినులతో వెకిలి చేష్టలు
చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాలు చేసినా.. కొందరిలో మార్పు రావడం లేదు. వయసు భేదం మరిచిన ప్రబుద్ధులు చిన్నపిల్లలపైనా...
చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాలు చేసినా.. కొందరిలో మార్పు రావడం లేదు. వయసు భేదం మరిచిన ప్రబుద్ధులు చిన్నపిల్లలపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించి, చిన్నారుల జీవితానికి మంచి బాటలు వేయాల్సిన విద్యాలయాలూ వీటికి వేదికవుతున్నాయి. విద్యార్థులకు మంచి, చెడు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన ఆందోళన కలిగిస్తోంది. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులతో ఓ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. స్కూల్ నుంచి ఇంటికెళ్లిన చిన్నారులు.. మరుసటి రోజు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించారు. వారిని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. మరోవైపు.. తాను అసభ్యంగా ప్రవర్తించలేదని, విద్యార్థినుల తల్లిదండ్రులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సదరు ఉపాధ్యాయుడు పేర్కొనడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు(Nellore) జిల్లా వెంకటగిరి గ్రామీణంలోని డక్కిలి ప్రాథమిక పాఠశాలలో అమానుషం జరిగింది. విద్యార్థినిపై ఓ ఉపాధ్యాయుడు(Teacher) అనుచితంగా ప్రవర్తించాడు. ఈ నెల 16 న మధ్యాహ్నం పాఠశాలలో ఉపాధ్యాయుడు వెకిలి చేష్టలకు పాల్పడటంతో మరుసటి రోజు విద్యార్థిని బడికి పోవడానికి నిరాకరించారు. కారణాలపై ఆరా తీయగా ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తిస్తున్నారన్న విషయం తెలిసిందని విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఎంఈవో కె.వెంకటేశ్వర్లు పాఠశాలకు చేరుకుని విచారించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, బుధవారం విద్యార్థిని బంధువులు పాఠశాలకు వచ్చి తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు తెలిపాడు.
Also Read
Bangarraju: ఓటీటీలోకి వచ్చేసిన బంగార్రాజు.. ఏందులో స్ట్రీమింగ్ అవుతుందంటే..
Viral Video: పిల్ల అయినా పులి పులే.. తల్లిని వణికించిన బుజ్జి పులి.. నవ్వులు పూయిస్తోన్న వీడియో..
Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇక నుంచి స్వామివారికి ఆర్జిత సేవలకు భారీగా ధరల పెంపు..