Family Murdered: తమిళనాడులో అస్తి కోసం ఘాతుకం.. నమ్మి భూమి అప్పగించిన వ్యక్తి కుటుంబాన్ని హతమార్చాడు..!

తమిళనాట భూమి కోసం ఓ కుటుంబాన్ని దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Family Murdered: తమిళనాడులో అస్తి కోసం ఘాతుకం.. నమ్మి భూమి అప్పగించిన వ్యక్తి కుటుంబాన్ని హతమార్చాడు..!
arrest
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 28, 2021 | 10:18 PM

Tamil Nadu Triple Murder: తమిళనాట భూమి కోసం ఓ కుటుంబాన్ని దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి భూమి కౌలుకు తీసుకుని నమ్మించాడు. యాజమాని నుంచి రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అతడి ఇంటికి వెళ్లి నిలదీశాడు. విసుగు చెందిన సదరు వ్యక్తి అప్పు ఇచ్చిన కుటుంబసభ్యులను హతమార్చాడు. ఈ దారుణ ఘటన త‌మిళ‌నాడులోని ఎరోడ్‌లో వెలుగు చూసింది

ఈరోడ్‌ జిల్లా చిన్నిమలై ప్రాంతానికి చెందిన కిజ్వాని గ్రామానికి చెందిన క‌రుప్పన‌కౌందేర్(72) అనే వ్యక్తి , భార్య మల్లిక, కుమార్తె దీప, పని మనిషి కరుప్పాయి నివాసముంటున్నారు. ప్రతిరోజు కుటుంబం మొత్తం పొలానికి వెళ్లి పనులు చూసుకుంటూ ఉంటారు. వీరి పొలం లో కొంత భాగం కరుప్పన్నన్ మిత్రుడైన ఆర్ క‌ళ్యాణ‌సుంద‌రం(43) లీజుకు తీసుకొని అక్కడే వ్యవసాయం చేస్తూ వస్తున్నాడు. ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా భూమి విషయం ఇద్దరికి మనస్పర్థలు రావడంతో కొంత కాలంగా దూరంగా కరుప్పన్నన్ మిత్రుడితో దూరంగా ఉంటున్నాడు.

ఇదిలావుంటే, ఊరిలో కరోనా మెడికల్ హెల్త్ చెక్ అప్ క్యాంపు ఏర్పాటు చేశారు. దీంతో కుటుంబసభ్యులు అందరూ కరోనా నుంచి రక్షించుకునేందుకు విటమిన్ టాబ్లెట్స్ తీసుకుని వేసుకోగా ఒక్క సారిగా కుప్పకూలి పోవడంతో ఇది గమనించిన ఇరుగుపొరుగు వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మల్లిక, కరుప్పాయి, దీప మృతి చెందారు. దీంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్యం వికటించి కుటుంబసభ్యులు మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపించారు.

అయితే, కరుప్పన్నన్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కోయంబత్తూరు ఆస్పత్రిలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. కాగా, కరుప్పన్నన్ కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులను ఆశ్రయించారు. కరుప్పన్నన్ తీసుకున్న విటమిన్ టాబ్లెట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించిన తరువాత అవి విషం టాబ్లెట్స్‌గా తేల్చారు. దీంతో టాబ్లెట్స్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా కరుప్పన్నన్ మిత్రుడు కల్యాణ సుందరం అసలు నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు వ్యవహారం బయటపడింది.

కరుప్పన్నన్‌ పొలం లీజుతో పాటు ఆయన నుంచి తీసుకున్న రూ.13 లక్షలు చెల్లించలేని స్థితిలో హత్యకు పథకం పన్నినట్టు తనతో ఈ హత్యలు చేయించినట్టుగా పోలీస్ విచారణలో వెల్లడైంది. దీంతో కళ్యాణసుంద‌రం, శ‌బ‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ పెరుండురై సబ్ కోర్టు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారిని 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసినట్లు ఈరోడ్ డిఎస్పీ సెల్వరాజ్ తెలిపారు.

Read Also….  Road Accident: హిమాచ‌ల్‌ప్రదేశ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ కారు.. 9మంది అక్కడిక‌క్కడే దుర్మరణం!