Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ పై లుకౌట్ నోటీసులు జారీ.. తప్పించుకు తిరుగుతున్నందుకే!

Sushil Kumar: ఒలింపిక్ మెడలిస్ట్, భారత్ అగ్రశ్రేణి రెజ్లర్ లలో ఒకడైన సుశీల్ కుమార్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఓ హత్య కేసులో సుశీల్ కుమార్ ను నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ పై లుకౌట్ నోటీసులు జారీ.. తప్పించుకు తిరుగుతున్నందుకే!
Sushil Kumar
Follow us

|

Updated on: May 10, 2021 | 7:46 PM

Sushil Kumar: ఒలింపిక్ మెడలిస్ట్, భారత్ అగ్రశ్రేణి రెజ్లర్ లలో ఒకడైన సుశీల్ కుమార్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఓ హత్య కేసులో సుశీల్ కుమార్ ను నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆచూకీ లభ్యం కావడంలేదని పోలీసులు చెబుతున్నారు. అతను తప్పించుకుని తిరుగుతున్నట్టుగా భావిస్తున్నారు. ఈ నెల 4 వ తేదీన ఢిల్లీలో జాతీయ స్థాయి రెజ్లర్ సాగర్ దంకడ్‌ పై కొందరు దాడి చేశారు. ఆ దాడిలో అతను మరణించాడు. అతడితో పాటు అతని స్నేహితులు కూడా దాడికి గురయ్యారు. ఈ దాడికి సుశీల్ కుమార్ అతనితో పాటు అతని మిత్రులు కారణమని పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డ బాధితులు కూడా ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దాడి జరిగినప్పటి నుంచి సుశీల్ కుమార్ తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి.

‘దాడి జరిగినప్పుడు సుశీల్‌ స్టేడియంలోనే ఉన్నాడని సాంకేతిక ఆధారాలతో ధ్రువీకరించాం. అతడిని అరెస్టు చేసేందుకు దిల్లీ, ఉత్తరాఖండ్‌లో వెతుకుతున్నాం’ అని పోలీసు అధికారులు తెలిపారు. తొలుత హరిద్వార్‌లో అతడి ఆచూకీ లభ్యమైందన్నారు. ఆ తర్వాత రిషికేష్‌లోని ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందాడన్నారు. ఆ తర్వాత హరియాణాలో గుర్తించామన్నారు. అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు అతడు ప్రతిసారీ తన చోటును మారుస్తున్నాడని వెల్లడించారు. అందుకే లుకౌట్‌ నోటీసులు జారీ చేశామని తెలిపారు.

అసలేం జరిగింది..

ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియం వద్ద గత సోమవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 24 ఏళ్ళ జాతీయ స్థాయి రెజ్లర్ సాగర్ దంకడ్‌ మరణించాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఆ రోజు రాత్రి ఒంటిగంట సమయంలో తీవ్ర గాయాలతో ఉన్న రెజ్లర్ ని వినాయక్ ఆసుపత్రికి తరలించారు. సుశీల్ కుమార్ కు చెందిన ఈ స్టేడియం బయట ఓ ఇంటిలో సాగర్ కుమార్ తో సహా మరో ఇద్దరు ఉండగా వారిని వెళ్లిపోవాలని సుశీల్ కుమార్ కోరాడని కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

అయితే, ఘర్షణకు కారణం ఏమిటనేది తెలియరాలేదు. కాగా వారెవరో తనకు తెలియదని, ఈ ఘటన చాలా పొద్దుపోయిన తరువాత జరిగిందని సుశీల్ కుమార్ చెప్పాడు. వారు ఘర్షణకు దిగినట్టు తెలియడంతో సమాచారాన్ని తాను పోలీసులకు తెలియజేశానని ఆయన చెప్పాడు. తన స్టేడియానికి, ఈ ఘటనకు సంబంధం లేదని అన్నాడు. అయితే, సుశీల్ కుమార్ పాత్ర ఈ ఘటనలో ఉందని అప్పుడే పోలీసులు చెప్పారు. తాజాగా సుశీల్ కుమార్ తప్పించుకు తిరుగుతున్నాడని అంటున్నారు. అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేశామని చెబుతున్నారు.

Sushil Kumar: సుశీల్ కుమార్ పాపులర్ రెజ్లర్.. 2008 లో జరిగిన బీజింగ్ ఒలంపిక్స్ లో కాంస్య పతకాన్ని, 2012 లో లండన్ లో జరిగిన ఒలంపిక్స్ లో రజత పతకాన్ని సాధించాడు.

Also Read: ఢిల్లీ స్టేడియం వద్ద ఘర్షణ, రెజ్లర్ మృతి, ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పై ‘అనుమానపు నీలినీడలు’

Ravinder Pal Singh: మరో మాజీ క్రీడాకారుడిని కాటేసిన కరోనా.. హాకీ దిగ్గజం రవీందర్‌పాల్ సింగ్ కన్నుమూత