Cyber Crime: మందు బాబును బుక్ చేయబోయి అడ్డంగా బుక్కైన సైబర్ నేరగాళ్లు.. నిమిషాల గ్యాప్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..
Cyber Crime: అసలే కరోనా కాలం.. బయటకెళ్లాలంటే భయం. మరోవైపు లాక్‌డౌన్.. దాంతో దిక్కుతోచని ఓ మందు.. ఆన్‌లైన్ ద్వారా మందు..
Cyber Crime: అసలే కరోనా కాలం.. బయటకెళ్లాలంటే భయం. మరోవైపు లాక్‌డౌన్.. దాంతో దిక్కుతోచని ఓ మందు.. ఆన్‌లైన్ ద్వారా మందు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ. 1,50,000 పోగోట్టుకున్నాడు. కానీ, బాధితుడి స్పీడ్‌కి, పోలీసుల స్పాట్ రియాక్షన్‌కి ఆ సైబర్ నేరగాళ్ల మైండ్ బ్లాంక్ అయ్యింది. దాంతో ఇటు బాధితుడి డబ్బు సేఫ్ అయ్యింది.. అటు కేటుగాళ్లు అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా జనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఓ వ్యక్తికి మద్యం తాగాలనిపించి ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రయత్నించాడు. ఓ ఆన్‌లైన్ సైట్‌లో బీరు ను ఆర్డర్ చేశాడు. అయితే, బిల్లు చెల్లింపు కోసం అవతలి వ్యక్తి ఒక లింక్‌ను పంపించాడు. ఆ లింక్ ద్వారా డబ్బులు పంపాలని చెప్పడంతో అతను అలాగే చేశాడు. అయితే, మద్యం ధరకు మించి అతని అకౌంట్ నుంచి కట్ అయింది. రూ. 1,50,000 అతని అకౌంట్ నుంచి కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటన్ అలర్ట్ అయిన బాధిత వ్యక్తి.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సైతం అంతే స్పీడ్‌గా రియాక్ట్ అయ్యారు. మెసేజ్ వచ్చిన నెంబర్ చెప్పగా.. ఆ నెంబర్ ఆధారంగా డబ్బు సైబర్ నేరగాళ్ల అకౌంట్‌కు వెళ్లకుండా ఫ్రీజ్ చేశారు. దాంతో బాధితుడి డబ్బులు తిరిగి అతని అకౌంట్‌లోనే జమ అయ్యాయి. అలాగే సైబర్ నేరగాళ్లు ఎవరా అనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. వారి ఐపీ అడ్రస్ ద్వారా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also read:
BSNL Offers: బిఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్లు.. కేవలం 100 రూపాయలతో మూడు నెలల పాటు..
Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ పై లుకౌట్ నోటీసులు జారీ.. తప్పించుకు తిరుగుతున్నందుకే!