Hyderabad: రికవరీ సొమ్ము గోల్‌మాల్.. ఎస్ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్‌..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jul 06, 2021 | 6:54 AM

Sub Inspector, Four constables suspended: అవినీతికి పాల్పడిన ఎస్ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ చర్యలు తీసుకున్నారు. గతంలో..

Hyderabad: రికవరీ సొమ్ము గోల్‌మాల్.. ఎస్ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్‌..
Suspended

Sub Inspector, Four constables suspended: అవినీతికి పాల్పడిన ఎస్ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ చర్యలు తీసుకున్నారు. గతంలో.. పేకాట స్థావరంపై దాడి చేసి రికవరీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ ఎస్ఐతోపాటు నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు వివరాలు.. గతేడాది నవంబర్‌లో హైదరాబాద్ మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో కానిస్టేబుళ్లు మురళి, ఇమాన్లు, రవికిరణ్‌, జానకిరామ్‌ బృందం 14 మందిని అరెస్టు చేసింది. అయితే ఈ కేసులో పట్టుబడిన వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బు రికవరీ చేసి, అధికారికంగా తక్కువగా చూపించారని సీపీకి ఫిర్యాదులు అందాయి.

దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు. అనంతరం ఈ కేసులో ఎస్ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లు అవకతవకలకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఎస్ఐ తోపాటు కానిస్టేబుళ్లను సీపీ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉంటే.. అరెస్టు అయిన వారిలో ఓ కానిస్టేబుల్‌ కూడా ఉండటం గమనార్హం. అయితే.. కానిస్టేబుల్ పట్టుబడిన సమయంలో అతన్ని మంగళ్‌హాట్‌ పోలీసులు వదిలి పెట్టకపోవడంతో రికవరీలో అవకతవకలు జరిగాయంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కాగా.. రూ.4.12 లక్షలు రికవరీ చేసి, వాటిని కోర్టులో సమర్పించామని మంగళ్‌హట్‌కు చెందిన ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఈ కేసులో చార్జిషీట్‌ కూడా వేశామని.. తప్పుడు ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. కాగా.. హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

Also Read:

Tragedy ‘పెళ్లైతే మేము విడిపోతాం.. కలిసి ఉండలేం’… కవలల ఆత్మహత్య !

Nellore Boy Missing: ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో.. పాపం సంజు! నాన్న అడుగులో అడుగేస్తూ వెళ్లిన చిన్నోడు కనిపించకుండా పోయాడు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu