లాక్‌డౌన్‌లోనూ కీచక చరిత్ర.. విద్యార్థి అరెస్ట్

పోస్కో, నిర్భయ లాంటి చట్టాలు తీసుకొస్తున్నా.. కీచకులకు ఎలాంటి భయం లేకుండా పోతుంది. పోలీసులన్నా, ఈ చట్టాలన్నా బేఖాతరు చేస్తున్నారు. తాజాగా 20 ఏళ్ల ఓ విద్యార్థి విషయానికొస్తే.. ఫేస్ బుక్ ద్వారా ఓ అమ్మాయితో స్నేహం పెంచుకున్నాడు. ఇక సీన్ షరా మామూలే. రోజూ చాటింగ్ చేస్తూండటంతో స్నేహం ముందిరింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను కోరాడు విద్యార్థి. అయితే ఆమె తిరస్కరించడంతో అక్కసు పెంచుకున్నాడు. అతనితో ఆమె మాట్లాడటం మానివేయడంతో.. ఆమె వాట్సాప్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:31 pm, Fri, 1 May 20
లాక్‌డౌన్‌లోనూ కీచక చరిత్ర.. విద్యార్థి అరెస్ట్

పోస్కో, నిర్భయ లాంటి చట్టాలు తీసుకొస్తున్నా.. కీచకులకు ఎలాంటి భయం లేకుండా పోతుంది. పోలీసులన్నా, ఈ చట్టాలన్నా బేఖాతరు చేస్తున్నారు. తాజాగా 20 ఏళ్ల ఓ విద్యార్థి విషయానికొస్తే.. ఫేస్ బుక్ ద్వారా ఓ అమ్మాయితో స్నేహం పెంచుకున్నాడు. ఇక సీన్ షరా మామూలే. రోజూ చాటింగ్ చేస్తూండటంతో స్నేహం ముందిరింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను కోరాడు విద్యార్థి. అయితే ఆమె తిరస్కరించడంతో అక్కసు పెంచుకున్నాడు. అతనితో ఆమె మాట్లాడటం మానివేయడంతో.. ఆమె వాట్సాప్ నెంబర్ కి అసభ్యకరమైన మెసేజ్‌లను పంపుతూ వేధించడం ప్రారంభించాడు. సోషల్ మీడియాలో నీ ఫొటోలు పెడతానంటూ బెదరించడంతో.. ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు విచారణ చేసి పోలీసులు.. అచ్చంపేట నివాసి గవిని సంజయ్ రాజుగా గుర్తించారు. రాజుపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు లైంగిక వేధింపుల కేసుతో పాటు ఐపీసీలోని 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. ఎల్బీ నగర్ ఖాకీలు అరెస్ట్ చేశారు.

Learn More: 

కరోనా లాక్‌డౌన్: వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్

హెలీకాఫ్టర్ మనీ.. క్రైసిస్‌కు పరిష్కారం కాదు.. అప్పులు చేయాల్సిందే!