మైనర్ బాలికపై రోజూవారీ కూలీ అత్యాచారయత్నం, అరెస్ట్

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఓ రోజు వారీ కూలీ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బండ్లగూడ నివాసి అయిన ఈ కూలీ కూరగాయల వ్యాపారం చేస్తుండేవాడు. వరసకి కూతురైన 11 ఏళ్ల అమ్మాయిని మాటలతో..

  • Tv9 Telugu
  • Publish Date - 1:45 pm, Fri, 1 May 20
మైనర్ బాలికపై రోజూవారీ కూలీ అత్యాచారయత్నం, అరెస్ట్

కరోనా వైరస్ కారణంగా‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మృగాళ్లు మాత్రం మారడం లేదు. నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వస్తున్నా, నిందితులను ఎంతో కఠినంగా శిక్షిస్తున్నా.. వారిలో మార్పులు రావడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మృగాలు రెచ్చిపోతున్నారు. కరోనా వ్యాప్తి చేయకుండా లాక్‌డౌన్ విధిస్తే.. కీచకులకు అదే వరంలా మారుతోంది. లాక్‌డౌన్‌ సమయంలోనూ మహిళలపై, బాలికలపై గృహ హింస, అత్యాచారం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా.. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఓ రోజు వారీ కూలీ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బండ్లగూడ నివాసి అయిన కూలీ.. వరసకి కూతురైన 11 ఏళ్ల అమ్మాయిని మాటలతో మభ్య పెట్టి, ఆమె చేతులు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో, వారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టంతో సహా ఐసీపీలోని 354 సెక్టన్ కింద కేసు పెట్టి అతన్ని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.

Learn More: 

కరోనా లాక్‌డౌన్: వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్

హెలీకాఫ్టర్ మనీ.. క్రైసిస్‌కు పరిష్కారం కాదు.. అప్పులు చేయాల్సిందే!