హైదరాబాద్‌లో హాట్‌స్పాట్ సెంటర్లు ఇవే..!
గత నాలుగు రోజులుగా హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. ఇప్పటికే తక్కువ కేసులు నమోదైన జిల్లాలో కరోనా రోగులందరూ కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో

హైదరాబాద్ పరిధిలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాంతాలుగా సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌లను ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాలలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే కరోనాను కట్టడి చేయగలమని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 60శాతం కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 21 జిల్లాలో కరోనా ఫ్రీ జిల్లాలుగా ఉన్నాయని పేర్కొన్న అధికారులు రెడ్‌జోన్ల ప్రాతిపదికన కరోనా కట్టడి చేయనున్నట్లు వివరించారు.
గత నాలుగు రోజులుగా హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. ఇప్పటికే తక్కువ కేసులు నమోదైన జిల్లాలో కరోనా రోగులందరూ కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ప్రస్తుతం సున్నా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు లేని జిల్లాలు రాష్ట్రంలో 13 ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటిలో 3 జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసుల సంఖ్య పూర్తిగా లేనేలేదు. దీంతో తెలంగాణలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ కోవిడ్ తీవ్రత తగ్గినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.