JK Stone pelting Cases: భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 375 ప్రత్యేక హోదాను రద్దు చేసిన అనంతరం ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భద్రతా దళాలపై.. స్థానికులు రాళ్లతో విరుచుకుపడుతున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. అల్లరి మూకల దాడుల ఘటనల్లో భద్రతా దళాలతోపాటు.. పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం బుద్ధి చెప్పేందుకు కఠిన సర్య్కూలర్‌ను జారీ చేసింది. రాళ్లు విసిరే వారికి పాస్‌పోర్టు, ఇతర ప్రభుత్వ సేవల కోసం అవసరమయ్యే ‘సెక్యూరిటీ క్లియరెన్స్’ను ఇవ్వబోమంటూ జమ్మూకాశ్మీర్ పోలీసులు ఆదివారం హెచ్చరించారు. రాళ్లు విసిరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ‘సెక్యూరిటీ క్లియరెన్స్’ను తిరస్కరించాలని సీఐడీ ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించినట్లు ప్రకటన ద్వారా వెల్లడించారు.
అయితే.. సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చే సమయంలో ఆ వ్యక్తి నేర చరిత్రను పూర్తిగా అధ్యయనం చేయాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశించింది. రాళ్లు విసిరే ప్రాంతాలు, ఘర్షణలకు చెలరేగిన ప్రాంతాల్లో.. పోలీసులు, భద్రతా బలగాలు, భద్రతా సంస్థల అధీనంలోని సీసీటీవీ ఫుటేజీలు, వీడియోలు, ఆడియోలను పరిశీలించాలని సర్య్కూలర్ లో ఆదేశించారు. పాస్‌పోర్ట్, సర్వీస్, ప్రభుత్వ సేవలు, పలు పథకాలకు సంబంధించిన ఏదైనా ఇతర ధృవీకరణ పత్రాల మంజూరు సమయంలో భద్రతకు హాని కలిగించే నేరాలను ప్రత్యేకంగా పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
ఇదిలాఉంటే.. కొన్ని రోజుల క్రితం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో కొంతమంది ప్రభుత్వ అధికారులను సర్వీస్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ సక్క్యూరిటీ క్లియరన్స్ ఆదేశాలివ్వడం.. దేశానికి వ్యతిరేకంగా కుట్రపన్నే వారికి గుణపాఠమని కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా తెలిపారు.
Also Read: