Boat Capsize: ఘోర ప్రమాదం.. నదిలో పడవ బోల్తా.. 22 మంది గల్లంతు.. ఆరు మృతదేహాలు లభ్యం..
Motihari Boat Capsize: బీహార్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మోతిహరి జిల్లాలోని నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20
Motihari Boat Capsize: బీహార్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మోతిహరి జిల్లాలోని నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20మందికి ప్రజలు నీటిలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదం.. షికార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సికార్హానా నదిలో చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పశువుల మోత కోసం పడవలో వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అయితే.. పడవ బోల్తా పడిన వెంటనే.. సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో జనం చేరుకొని పలువురిని రక్షించారు. నీటిలో గల్లంతైన వారి కోసం పోలీసులు, రెస్క్యూ బృందాలు పెద్ద ఎత్తున గాలిస్తున్నాయి. గజఈతగాళ్లను రంగంలోకి దింపి గల్లంతైన వారి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో 22 మంది వరకు ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా.. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. స్థానికులు నలుగురిని రక్షించగా.. వారిని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు ఏడీఎం అనిల్‌కుమార్ తెలిపారు. అయితే.. ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాల్లో ఒక బాలిక మృతదేహం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: