AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah Lunch Meet: తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సహా నలుగురు ముఖ్యమంత్రులతో అమిత్ షా ప్రత్యేక లంచ్ మీటింగ్!

వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం అనంతరం కొందరు ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Amit Shah Lunch Meet: తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సహా నలుగురు ముఖ్యమంత్రులతో అమిత్ షా ప్రత్యేక లంచ్ మీటింగ్!
Amit Shah Lunch Meet With Cms
Follow us
KVD Varma

|

Updated on: Sep 26, 2021 | 4:46 PM

Amit Shah Lunch Meet: వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం అనంతరం కొందరు ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో అమిత్ షా లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి భోజనం చేసిన అమిత్ షా నక్సల్స్ సమస్యపై వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా పరిస్థితి, అభివృద్ధి ప్రాజెక్టుల అమలును నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు.

వాస్తవానికి ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించారు. అయితే, ఈ నాలుగు రాష్ట్రాలకు రాష్ట్ర మంత్రి లేదా ఉన్నత అధికారులు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాల అవసరాలు, తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు మోహరించిన బలగాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్లు, వంతెనలు, పాఠశాల, ఆరోగ్య కేంద్రాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను షా పరిశీలించారు.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మావోయిస్టుల సమస్యను తన రాష్ట్రంలో మూడు జిల్లాలకు పరిమితం చేశామనీ, దానిని మరింత తగ్గించడానికి ఏమి చేయాలో సమావేశంలో చర్చించామని చెప్పారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దేశంలో మావోయిస్టుల హింస గణనీయంగా తగ్గింది.ఇప్పుడు దాదాపు 45 జిల్లాలలో నక్సల్స్ ఉనికి ఉంది. ఏదేమైనా, దేశంలోని మొత్తం 90 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా పరిగణిస్తున్నారు. అదేవిధంగా మంత్రిత్వ శాఖ భద్రతా సంబంధిత వ్యయం (SRE) పథకం కింద ఉన్నాయి. నక్సల్స్ సమస్యను, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (LWE) అని కూడా పిలుస్తున్నారు. 2019 లో 61 జిల్లాలు..2020 లో కేవలం 45 జిల్లాలలో మాత్రమే నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా నివేదించారు. 2015 నుండి 2020 వరకు LWE ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 380 మంది భద్రతా సిబ్బంది, 1,000 మంది పౌరులు మరియు 900 మంది నక్సల్స్ మరణించారు. ఇదే సమయంలో మొత్తం 4,200 మంది నక్సల్స్ కూడా లొంగిపోయారని డేటా పేర్కొంది.

Also Read: PM Modi in US: ఢిల్లికి చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన ప్రజలు..

Ayushman Bharat: రూ .5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. ఎవరు అర్హులో తెలుసుకోండి..