Delhi crime: దేశ రాజధానిలో దారుణం.. 87ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి.. నిస్సహాయ స్థితిలో ఉండగా పైశాచికం
సమాజంలో మానవ విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. మానవత్వం మరిచి కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా దిల్లీలో జరిగిన ఓ ఘటన విస్తుపరుస్తోంది. వయసు భేదం మరిచిన..
సమాజంలో మానవ విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. మానవత్వం మరిచి కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా దిల్లీలో జరిగిన ఓ ఘటన విస్తుపరుస్తోంది. వయసు భేదం మరిచిన ఓ దుండగుడు 87 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు నిస్సహాయ స్థితిలో ఉండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం అమెపై దాడి చేసి, సెల్ ఫోన్ తీసుకుని ఉడాయించాడు. గమనించిన బాధితురాలి కుటుంబసభ్యులు వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. మంచానికే పరిమితమైన 87 ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి వృద్ధురాలు ఉంటున్న ఇంట్లోకి గ్యాస్ ఏజెన్సీ నుంచి వచ్చానని చెప్పి ప్రవేశించాడు. ఇంట్లో రిపేర్ చేసేందుకు పిలిచారని వృద్ధురాలితో చెప్పాడు. ఆగంతకుడి తీరుపై వృద్ధురాలికి అనుమానం వచ్చింది. ఇది గమనించిన ఆ వ్యక్తి… ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, మొబైల్ ఫోన్ను లాక్కున్నాడు. కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి వృద్ధురాలు గాయపడి ఉంది. బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లి. వృద్ధురాలిపై లైంగిక దాడి జరిగిందని కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఫిర్యాదు నమోదు చేసుకోవడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండించిన పోలీసులు.. తిలక్ నగర్ స్టేషన్లో ఆదివారం రాత్రి దొంగతనానికి సంబంధించిన కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు. ఫిర్యాదుదారులు తనపై లైంగిక దాడి జరిగిందని సోమవారం చెప్పారని, ఆ తర్వాత సంబంధిత సెక్షన్లను ఎఫ్ఐఆర్కు జోడించినట్లు తెలిపారు.
Also Read
ప్రాణం తీసిన వాట్సాప్ స్టేటస్.. కూతురి పోస్ట్ చూసి.. ఏం చేశారంటే..?
VIjayawada Crime: పెట్రోల్ బంకులో చోరీ.. సీసీ కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు
AP Crime: అదనపు కట్నానికి తల్లీ, కుమార్తె మృతి.. హత్యా..? ఆత్మహత్యా..?