ప్రాణం తీసిన వాట్సాప్ స్టేటస్.. కూతురి పోస్ట్ చూసి.. ఏం చేశారంటే..?
సామాజిక మాధ్యమాలు మనకు ఎంత ఉపయోగపడతాయో.. కొన్ని సార్లు అంతే హాని కలిగిస్తాయి. సోషల్ మీడియాలో ఏదైనా సందేశాన్ని పోస్ట్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి....
సామాజిక మాధ్యమాలు మనకు ఎంత ఉపయోగపడతాయో.. కొన్ని సార్లు అంతే హాని కలిగిస్తాయి. సోషల్ మీడియాలో ఏదైనా సందేశాన్ని పోస్ట్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మెసేజ్ ద్వారా ఎవరికైనా నష్టం కలిగిలేంచాలా, వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉండకుండా వ్యవహరించాలి. లేకపోతే తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా కూతురు పెట్టిన వాట్సాప్ స్టేటస్ తల్లి ప్రాణాలు తీసింది. వాట్సాప్ స్టేటస్ తమను ఉద్దేశించిందని భావించిన కొందరు.. తల్లీకూతుళ్లపై దాడికి పాల్పడ్డారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడ్డ తల్లి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది.
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా బోయ్‌సార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి, తన తల్లి లీలావతి దేవితో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో ఈనెల 10న యువతి తన వాట్సాప్ స్టేటస్‌లో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. అయితే ఆ స్టేటస్ తన గురించే అని భావించిన యువతి స్నేహితురాలు.. ఈ విషయాన్ని తల్లి, సోదరులకు తెలిపింది. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. లీలావతి ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగారు. తల్లి, కుమార్తెపై దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన లీలావతి దేవి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన బోయ్‌సార్ పోలీసులు సోమవారం ఈ వివరాలును వెల్లడించారు. యువతి పెట్టిన వాట్సాప్ స్టేటస్ స్నేహితురాలిని ఉద్దేశించి పోస్టు చేసింది కాదని, అదో సాధారణమైన పోస్టేనని పోలీసులు తెలిపారు. లీలావతి దేవి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేశామన్నారు.
ఇవీ చదవండి.
AP Crime: అదనపు కట్నానికి తల్లీ, కుమార్తె మృతి.. హత్యా..? ఆత్మహత్యా..?
Hyderabad: 16 ఏళ్లుగా పోలీసులకు చుక్కలు.. 70వేల ఫోన్ నంబర్స్ సెర్చ్.. ఫైనల్‌గా చిక్కాడు