AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kids Missing: ‘డబ్బులు, పేరు సంపాదించిన తర్వాతే ఇంటికి వస్తాం.. మాకోసం వెతకొద్దు’.. లేఖ రాసి పారిపోయిన విద్యార్థులు..

Kids Missing: ఇంటి నుంచి పారిపోతున్నాం డబ్బులు సంపాదించిన తర్వాతే తిరిగి వస్తామని చెప్పి కొందరు విద్యార్థులు లేఖ రాసిపెట్టి పారిపోయిన సంఘటన ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురి చేసింది. బెంగళూరులో చోటుచేసుకున్న..

Kids Missing: 'డబ్బులు, పేరు సంపాదించిన తర్వాతే ఇంటికి వస్తాం.. మాకోసం వెతకొద్దు'.. లేఖ రాసి పారిపోయిన విద్యార్థులు..
Narender Vaitla
|

Updated on: Oct 12, 2021 | 9:32 PM

Share

Kids Missing: ఇంటి నుంచి పారిపోతున్నాం డబ్బులు సంపాదించిన తర్వాతే తిరిగి వస్తామని చెప్పి కొందరు విద్యార్థులు లేఖ రాసిపెట్టి పారిపోయిన సంఘటన ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురి చేసింది. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా ఒక్కసారిగా అలజడి సృష్టించింది. బెంగళూరులోని బాగలగుంటల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. పరిక్షిత్‌, నందన్‌, కిరణ్‌ అనే ముగ్గురు విద్యార్థులు ఒకే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నారు. అయితే వీరికి చదువు కంటే క్రీడలపై ఆసక్తి ఉండేది. కానీ తల్లిదండ్రులు మాత్రం చదువుకోమని ఒత్తిడి చేసే వారు. దీంతో ఇంటి నుంచి పారిపోవాలని ఫిక్స్‌ అయ్యారు. అనుకున్నట్లే ప్లాన్‌ ప్రకారం శనివారం ఇంటి నుంచి పారిపోయారు. అయితే సాయంత్రం వరకు వేచి చూసిన తల్లిదండ్రులు విద్యార్థులు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంట్లో సెర్చ్‌ చేసేసరికి లేటర్స్ దొరికాయి.

ఇందులో.. ‘మాకు చదువు కంటే క్రీడలంటేనే ఎక్కువ ఇష్టం. మీరు మాపై ఎంత ఒత్తిడి తెచ్చినా మాకు చదువుపై ఆసక్తి కలగడం లేదు. మేము మా క్రీడల్లోనే రాణించాలనుకుంటున్నాం. మాకు కబడ్డీ అంటే ఇష్టం. మేము క్రీడా రంగంలో మంచి పేరు సంపాదించుకొని. మళ్లీ ఇంటికి తిరిగివస్తాం’ అని రాసుంది. విద్యార్థులు ఎక్కడికి వెళ్లారన్నదానిపై దృష్టి సారించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే బెంగళూరులోనే ఇలాంటి ఘటన మరోకటి జరిగింది. సదరు ముగ్గురు విద్యార్థుల్లాగే మరో నలుగురు ఆదివారం అదృశ్యమయ్యారు. వీరిలో అమృత వర్షిణి(21), 12 ఏళ్ల రోయన్‌ సిద్ధార్థ్‌, చింతన్‌, భూమి ఉన్నారు. ఇలా కేవలం రెండు రోజుల వ్యవధిలో ఏడుగురు అదృశ్యంకావడంతో పోలీసులు ఈ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్నారు.

Also Read: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌లో మ‌ళ్లీ మంత్లీ స‌బ్‌స్కిప్ష‌న్ ఆప్ష‌న్‌.. ధరల వివరాలు

T20 World Cup 2021: నిన్న ఉమ్రాన్ మాలిక్.. నేడు అవేష్ ఖాన్‎.. టీం ఇండియా నెట్ బౌలర్లుగా ఎంపిక..!

Big News Big Debate: ‘ మా ‘ లో రాజీడ్రామా లైవ్ వీడియో..