ఔట‌ర్‌రింగ్ రోడ్డుపై ఘోర‌ప్ర‌మాదం..ఆరుగురు మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔట‌ర్ రింగ్‌రోడ్డుపై అర్ధ‌రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రింగింది. శంషాబాద్ స‌మీపంలోని పెద్ద గోల్కోండ వ‌ద్ద బొలెరో వాహ‌నాన్నా లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో...

  • Jyothi Gadda
  • Publish Date - 8:28 am, Sat, 28 March 20
ఔట‌ర్‌రింగ్ రోడ్డుపై ఘోర‌ప్ర‌మాదం..ఆరుగురు మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔట‌ర్ రింగ్‌రోడ్డుపై అర్ధ‌రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రింగింది. శంషాబాద్ స‌మీపంలోని పెద్ద గోల్కోండ వ‌ద్ద బొలెరో వాహ‌నాన్నా లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు కూలీలు మృతిచెందారు. కాగా మృతిచెందినవారు క‌ర్నాట‌క వాసులుగా తెలిసింది. ప్ర‌మాద స‌మ‌యంలో టెంపోలో 20 మంది వ‌ల‌స కూలీలు ఉన్నారు. వీరంతా రోడ్డు కాంట్రాక్ట్ ప‌నులు చేసేవారు లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఎక్క‌డా ప‌ని దొర‌క‌క‌పోవ‌డంతో వీరంతా త‌మ స్వ‌స్థ‌లానికి బ‌యల్దేరారు. శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొంది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయ‌ప‌డిన వారంద‌రినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కార‌ణ‌మైన లారీ డ్రైవ‌ర్ ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే, లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా ఓటర్‌ మార్గాన్ని మూసి ఉంచిన నేపథ్యంలో వీరి వాహనానికి అనుమతి ఎలా లభించిదన్నది తెలియాల్సి ఉంది.