ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ విమానాశ్రయంపైకి తాలిబన్ల రాకెట్ దాడి..రన్ వే ధ్వంసం.. విమాన సర్వీసుల రద్దు
ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ విమానాశ్రయం పైకి తాలిబన్లు మూడు రాకెట్లను ప్రయోగించారు. శనివారం రాత్రి వీటిలో రెండు రాకెట్లు ఎయిర్ పోర్టు రన్ వేను తాకాయని, రన్ వే తీవ్రంగా దెబ్బ తిన్నదని ఎయిర్ పోర్ట్ చీఫ్ మసూద్ పాస్తున్ తెలిపారు.
ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ విమానాశ్రయం పైకి తాలిబన్లు మూడు రాకెట్లను ప్రయోగించారు. శనివారం రాత్రి వీటిలో రెండు రాకెట్లు ఎయిర్ పోర్టు రన్ వేను తాకాయని, రన్ వే తీవ్రంగా దెబ్బ తిన్నదని ఎయిర్ పోర్ట్ చీఫ్ మసూద్ పాస్తున్ తెలిపారు. ఫలితంగా విమాన సర్వీసులనన్నింటినీ రద్దు చేసినట్టు ఆయన చెప్పారు. రన్ వే మరమ్మతులు, ఇతర ఆపరేషన్స్ జరుగుతున్నాయని, విమాన సర్వీసుల పునరుద్ధరణ త్వరలో జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ రాకెట్ దాడుల విషయాన్నీ కాబూల్ లోని సివిల్ ఏవియేషన్ అధికారులు ధృవీకరించారు. కాందహార్ శివారు ప్రాంతాలపై కొన్నివారాలుగా తాలిబన్లు పట్టు బిగిస్తున్నారు. కాందహార్ ను కూడా వశపరచుకోవాలన్నది వీరి ఆలోచనగా చెబుతున్నారు. రాజధాని కాబుల్ నగరానికి తమను విమానాల ద్వారా తరలించాలంటే ఈ విమానాశ్రయాన్ని హస్తగతం చేసుకోవడం తమ లక్ష్యమని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. బహుశా అందువల్లే మొదటిసారిగా ఇక్కడికి రాకెట్లను ప్రయోగించారు.
ఇప్పటికే పశ్చిమాన హెరాత్ ప్రావిన్స్, దక్షిణాన లష్కర్ ప్రావిన్స్ దాదాపు వీరి అధీనంలో ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చాలా వాటిని తాలిబన్లు తమ అధీనం లోకి తెచ్చుకున్నారు., ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగుతున్నకొద్దీ.. వీరు రెచ్చిపోతున్నారు. ఇదే అదనని ఆఫ్ఘన్ దళాలపై ఒత్తిడి పెంచుతున్నారు. పలు బోర్డర్ క్రాసింగ్స్ పై తాలిబన్ల పతాకాలు ఎగురుతున్నాయి. ఇటీవల ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని నివాసం వద్ద కూడా రాకెట్లు పడ్డాయి. అయితే ఆ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అటు తాలిబాన్లపై అమెరికా వైమానిక దాడులు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: అస్సాంతో సరిహద్దు వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించుకుంటాం.. మిజోరం సీఎం జొరాంతాంగా
బెన్ స్టోక్స్ కంటే ముందు.. మానసిక సమస్యలతో విరామం తీసుకున్న క్రికెటర్లెవరో తెలుసా..?