- Telugu News Photo Gallery Cricket photos Cricketers break from mental health ben stokes sarah taylor glenn maxwell
బెన్ స్టోక్స్ కంటే ముందు.. మానసిక సమస్యలతో విరామం తీసుకున్న క్రికెటర్లెవరో తెలుసా..?
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆగస్టు 4 నుంచి భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. మానసిక ఆరోగ్యం బాగోలేదంటూ విరామం తీసుకుంటున్నాడు. అయితే, అతని కంటే ముందు మరికొంతమంది క్రికెటర్లు కూడా ఇదే కారణంతో క్రికెట్‌కి దూరమయ్యాడు.
Updated on: Aug 01, 2021 | 12:20 PM

క్రీడా ప్రపంచంలో మెంటల్ హెల్త్ సమస్య చాలా తీవ్రంగా మారింది. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ విరామం తీసుకుంటున్నట్లు దాదాపు ప్రతి టోర్నమెంట్ నుంచి వార్తలు వింటూనే ఉన్నాం. టోక్యో ఒలింపిక్స్ -2020 నుంచి కూడా ఈ వార్త వచ్చింది. ఈ కారణంగా అమెరికన్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్‌లోనూ కొందరు ఆటగాళ్లు ఇలానే విరామం తీసుకున్నారు. మానసికంగా దృఢంగా ఉండేందుకు గత కొన్నేళ్లుగా క్రికెట్ నుంచి విరామం తీసుకున్న క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

క్రికెట్‌లో తాజాగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మానసిక ఆరోగ్యం కారణంగా విరామం తీసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. అంటే ఆగస్టు 4 నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో స్టోక్స్ కనిపించడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ (ECB) ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.

మానసిక సమస్యల కారణంగా క్రికెట్‌కు విరామం ఇచ్చిన క్రికెటర్లలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కూడా ఒకరు. 2019 లో మానసిక సమస్యలతో క్రికెట్‌కు కొంతకాలం దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో శ్రీలంకతో టీ 20 సిరీస్ జరుగుతున్న సందర్భంలో విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని నెలల తర్వాత తిరిగి ఎంట్రీ ఇచ్చాడు.

ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ విల్ పుకోవ్‌స్కీ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. 2018 చివరలో అతను మానసిక ఆరోగ్యం కారణంగా విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. 2019లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌కి ఎంపికయ్యాడు. కానీ ప్లేయింగ్ 11లో ఎంపిక కానందున అతని మానసిక ఆరోగ్యం దెబ్బతింది. దీంతో క్రికెట్‌కు విరామం ఇచ్చాడు.

ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ సారా టేలర్ కూడా ఇలాంటి సమస్యతోనే బాధపడింది. సారా టేలర్ ఆందోళన కారణంగా క్రీడకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకుంది. అతను 2019లో ఆటకు వీడ్కోలు ప్రకటించింది. పదవీ విరమణ చేస్తున్నప్పుడు ఈ నిర్ణయం చాలా కష్టమైనది అని పేర్కొంది.




