Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న బస్సు.. ఆరుగురు దుర్మరణం..
UP Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యూపీలోని బులంద్‌షహర్ సబల్‌పూర్ సమీపంలో ఓ కారును
UP Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యూపీలోని బులంద్‌షహర్ సబల్‌పూర్ సమీపంలో ఓ కారును ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఢిల్లీ నుంచి బులంద్ షహర్ వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. ఈ ఘటన దిబాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సబల్పూర్‌లో శుక్రవారం రాత్రి 93వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. శబ్ధం విన్న వెంటనే స్థానికులు భయంతో అక్కడకు పరుగులు తీశారు. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. వీరంతా సంభాల్ జిల్లాలో బంధువు మరణించగా.. అతని అంత్యక్రియలకు హాజరై తిరిగివస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి బస్సు డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బస్సు అతివేగంగా ఢీకొట్టడంతో కారులోని వారంతా మరణించారని పోలీసులు వెల్లడించారు.
Also Read: