Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM robbery: కూకట్‌పల్లి ఏటీఎం దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఒకరి అరెస్ట్, మరొకరి కోసం గాలింపు..!

కూకట్‌పల్లి ఏటీఎం దోపిడీ కేసులో పోలీసులు.. దొంగను అదుపులోకి తీసుకున్నారు. దోపిడీకి చేసిన వాళ్లిద్దరూ పాత నేరస్తులే అని తేలింది. ఈ ఇద్దరిలో ప్రస్తుతం ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ATM robbery: కూకట్‌పల్లి ఏటీఎం దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఒకరి అరెస్ట్, మరొకరి కోసం గాలింపు..!
Follow us
Balaraju Goud

|

Updated on: May 01, 2021 | 11:47 AM

Hyderabad ATM robbery: కూకట్‌పల్లి ఏటీఎం దోపిడీ కేసులో పోలీసులు.. దొంగను అదుపులోకి తీసుకున్నారు. దోపిడీకి చేసిన వాళ్లిద్దరూ పాత నేరస్తులే అని తేలింది. ఈ ఇద్దరిలో ప్రస్తుతం ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఇద్దరు కలిసి సైబరాబాద్, హైదరాబాద్ లలో పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారని పోలీసులు తెలిపారు. 14 రోజుల కిందట జీడిమెట్లలోని మనీట్రాన్స్‌ఫర్‌ సంస్థలో దోపిడీకి పాల్పడ్డారు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు.

ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి దగ్గర తుపాకీతో డబ్బులు కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఇద్దరూ గతంలోనే అనేక నేరాలు చేసారని… దుండిగల్‌లోనూ దారి దోపిడికి పాల్పడినట్లు తెలిసింది. కూకట్‌పల్లిలో హెచ్‌డీఎఫ్‌సీలో చోరీ కోసం ఈ దొంగలిద్దరూ ఉపయోగించిన బైక్‌ను కూడా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏప్రిల్‌ 16న జీడిమెట్ల పరిధిలో ఓ మనీ ట్రాన్స్‌ఫర్‌ సంస్థలో రెండు లక్షలు దోచుకున్నారు. ఆ సమయంలో ఆచూకీ లభించకుండా మొబైల్‌ ఫోన్‌ను మరో చోట పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

రెండు రోజుల క్రితం కూకట్‌పల్లిలోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం మిషన్‌లో డబ్బులు నింపే సమయంలో ఇద్దరు దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి నగదు ఎత్తుకుపోయారు. కూకట్‌పల్లి మెయిన్ రోడ్‌లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పెద్ద మొత్తంలో నగదు చోరీకి గురైనట్లు తెలుస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పక్కనే ఉన్న ఏటీఎంలో సిబ్బంది రోజూ డబ్బులు నింపుతుంటారు. ఈరోజు మధ్యాహ్నం కూడా సెక్యూరిటీ గార్డుతో కలిసి ఓ ఉద్యోగి డబ్బుతో ఏటీఎంతో నగదు నింపేందుకు వెళ్లారు. ఏటీఎం మిషన్ ఓపెన్ చేసి నగదు నింపుతుండగా లోనికి వచ్చిన ఇద్దరు దుండగులు వారిపై కాల్పులు జరిపి నగదు తీసుకుని పరారయ్యారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు ఆలీతో పాటు బ్యాంకు ఉద్యోగి అక్కడిక్కడే తీవ్రంగా గాయపడ్డారు.

కాల్పుల శబ్ధంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు అక్కడికి చేరుకునేసరికే దుండగులు నగదుతో పరారయ్యారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు క్షణాల్లోనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే సెక్యూరిటీ గార్డు ఆలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడి కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైందని, అందువల్లే అతడిని కాపాడలేకపోయామని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే జరిగిన ఈ దారుణ ఘటనతో ప్రజలు వణికిపోయారు.

Read Also…  Etela Rajender: వివరణ తీసుకోకుండా విచారణకు ఆదేశించారు.. కుట్ర చేస్తున్నదెవరో త్వరలో బయట పడుతుందన్న ఈటల