AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రియా చక్రవర్తికి బెయిల్ మంజూరును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకెక్కిన ఎన్సీబీ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి బాంబేహైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సుప్రీంకోర్టుకెక్కింది.

రియా చక్రవర్తికి బెయిల్ మంజూరును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకెక్కిన ఎన్సీబీ
Rhea Chakraborty
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 15, 2021 | 7:27 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి బాంబేహైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సుప్రీంకోర్టుకెక్కింది. సుశాంత్ సింగ్ కి డ్రగ్స్ అలవాటు చేసిందన్న ఆరోపణపై ఈ సంస్థ ఆమెను విచారించడం, ఈ కేసులో అరెస్టయిన ఆమె గత ఏడాది సుమారు నెల రోజులు జైలు శిక్ష అనుభవించడం తెలిసిందే. అయితే తనపై వచ్చిన  ఆరోపణలను ఖండిస్తూ.. ఆమె బాంబేహైకోర్టుకెక్కగా ఆమెకు బెయిల్ లభించింది. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని, దేశం వదిలి వెళ్లరాదన్న షరతులపై రియాకు బెయిల్ లభించింది.రియాతో బాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా 33 మందిపై ఎన్సీబీ ఈ నెలారంభంలో ముంబైలోని స్పెషల్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 200 మందికి పైగా సాక్షులను విచారించి 12 వేల పేజీలతో ఈ ఛార్జ్ షీట్ రూపొందించారు. రియా డ్రగ్స్ సిండికేట్ లో చురుకైన పాత్ర వహిస్తూ వచ్చిందని  ఇందులో పేర్కొన్నారు. అయితే ఈ ఛార్జ్ షీట్ రూపకల్పన నిష్ప్రయోజనకరమైనదిగా ఆమె తరఫు లాయర్ సతీష్ మాన్ షిండే కొట్టి పారేశారు. తన క్లయింటుపై వచ్చిన ఆరోపణలకు ఇదివరకే సమాధానాలు చెప్పామని,  ఎన్సీబీ తగిన ఆధారాలను చూపలేకపోయిందని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యులో  అన్నారు.

రియాకు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా బాంబే హైకోర్టు.. డ్రగ్ డీలర్ల చైన్ లో ఈమె భాగం కాదని, డబ్బు సంపాదించేందుకు ఈమె ఎవరికో వాటిని ఇవ్వడానికి  ప్రయత్నించిందన్న ఆరోపణలు సరికావని వ్యాఖ్యానించిందని ఆయన గుర్తు చేశారు.  డ్రగ్ కేసులో రియాను గత ఏడాది సెప్టెంబరులో ఎన్సీబీ అరెస్టు చేసింది.  ఈ కేసు గత ఏడాది సుదీర్ఘ కాలం కొనసాగింది. అయితే మళ్ళీ ఎన్సీబీ తాజాగా ఛార్జ్ షీట్ రూపొందించడమే కాక.. బాంబేహైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ పై కోర్టు గురువారం విచారణ జరపనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి:  uttarakhand cm ప్రధాని నరేంద్రమోదీపై ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కీలక వ్యాఖ్యలు..!

Bank employees strike : రెండు రోజులంతే, హైదరాబాద్ కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన