Sandile Wood: గుంటూరు జిల్లా బాట పట్టిన ఎర్ర చందనం.. నెల రోజుల్లో రెండుసార్లు పట్టుబడిన దుంగలు..
శేషాచలం అడవుల నుంచి విదేశాలకు అక్రమ రవాణా అయ్యే ఎర్ర చందనం గుంటూరు జిల్లా బాట పట్టింది. నెల రోజుల్లో అక్రమంగా రవాణా చేస్తున్న రెడ్ శాండిల్ దుంగలను రెండు సార్లు పోలీసులు పట్టుకున్నారు...
శేషాచలం అడవుల నుంచి విదేశాలకు అక్రమ రవాణా అయ్యే ఎర్ర చందనం గుంటూరు జిల్లా బాట పట్టింది. నెల రోజుల్లో అక్రమంగా రవాణా చేస్తున్న రెడ్ శాండిల్ దుంగలను రెండు సార్లు పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి చీరాలకు రెండు బోలేరు వాహానాల్లో తరలిస్తున్న ఇరవై లక్షల రూపాయల విలువ చేసే 211 దుంగలను నాగార్జునసాగర్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. వారం రోజుల క్రితం చేపల దాణా బస్తాల కింద ఉంచి తరలిస్తున్న 78 దుంగలను పట్టుకున్నారు.
మొత్తం మీద గుంటూరు జిల్లా మీదుగా చీరాలకు తరలించి అక్కడ నుంచి సముద్రం మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా అనుమతి తీసుకొని విక్రయించే ఎర్రచందనం టన్నుకి మూడు నుంచి ఏడు లక్షల రూపాయలు వస్తే స్మగ్లర్ల ద్వారా తరలించే రెడ్ శాండిల్ టన్నుకు పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయలు వస్తుంది.
దీంతో అనుమతితో సాగు చేస్తున్న వాళ్లు కూడా స్మగ్లర్ల ద్వారానే విక్రయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి చీరాల వైపుకు ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్లు భావిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ మీదుగా చీరాల వెళ్లే దారి అత్యంత సేఫ్టి మార్గంగా స్మగ్లర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నిఘా పెంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also.. AP Crime News: 15 ఏళ్లు అవుతోన్నా ప్రమోషన్ రావట్లేదని ఎస్‌ఐ ఆత్మహత్య.. మద్యంలో పురుగుల మందు కలుపుకొని..