విషాదం.. ఏం కష్టమొచ్చిందో పాపం.. మెట్టింట్లో ఎమ్మెల్యే కూతురు సూసైడ్..

రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే సురేష్‌ ధక్కడ్‌ కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వయస్సు 24 ఏళ్లు. రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలోని తన అత్తగారి ఇంట్లో శుక్రవారం రాత్రి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. మృతురాలి భర్త డా. జైసింగ్‌. ఇతను రాజస్థాన్‌ వైద్య విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే రూంలో ఎలాంటి సూసైడ్ లెటర్ లభ్యం […]

విషాదం.. ఏం కష్టమొచ్చిందో పాపం.. మెట్టింట్లో ఎమ్మెల్యే కూతురు సూసైడ్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 21, 2020 | 2:21 PM

రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే సురేష్‌ ధక్కడ్‌ కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వయస్సు 24 ఏళ్లు. రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలోని తన అత్తగారి ఇంట్లో శుక్రవారం రాత్రి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. మృతురాలి భర్త డా. జైసింగ్‌. ఇతను రాజస్థాన్‌ వైద్య విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే రూంలో ఎలాంటి సూసైడ్ లెటర్ లభ్యం కాలేదని.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, సురేష్‌ ధక్కడ్‌ మధ్యప్రదేశ్‌లోని పొహారీ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సభ్యుల్లో ఒకరు.