Robbery: భారీ చోరీ.. 12 నిమిషాల్లో 17 కేజీల బంగారం, 9 లక్షలు చోరీ.. ఆ తర్వాత ఏమైందంటే..?
Manappuram robbery: రాజస్థాన్‌లోని చూరు జిల్లాలో సినిమాను తలపించేలా భారీ చోరీ జరిగింది. 12 నిమిషాల్లోనే నలుగురు దుండగులు 17 కిలోల
Manappuram robbery: రాజస్థాన్‌లోని చూరు జిల్లాలో సినిమాను తలపించేలా భారీ చోరీ జరిగింది. 12 నిమిషాల్లోనే నలుగురు దుండగులు 17 కిలోల బంగారం, 9 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు మూడు గంటల్లోనే వారి ఆట కట్టించారు. ఈ సంఘటన చూరులో సోమవారం జరిగింది. మధ్యాహ్నం వేళ మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లోకి నలుగురు దుండగులు ఆయుధాలతో ప్రవేశించారు. ద్విచక్రవాహనాలపై వచ్చిన ఈ దుండగులు సిబ్బందిని తుపాకులతో బెదిరించి మరుగుదొడ్డిలో బంధించారు. భవనంలోని అలారం ధ్వంసం చేశారు. సీసీటీవీ కెమెరాల వైర్లు కత్తిరించారు. బ్రాంచ్ ప్రధాన ద్వారం మూసివేసి కేవలం 12 నిమిషాల్లో బంగారం, నగదును తమ బ్యాగుల్లో సర్దుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే సిబ్బంది చూరు పోలీసులకు సమాచారమిచ్చారు.
వెంటనే పోలీసు సిబ్బంది సమీప ప్రాంతాల్లోనే పోలీసుస్టేషన్లకు సమాచారమిచ్చారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ సంఘటన జరిగితే.. ఆ తర్వాత మూడు గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చూరు ఏఎస్పీ నీరజ్ పాథక్ తెలిపారు. 17 కేజీల బంగారం, .92 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మిగతా ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారని వారిని కూడా పట్టుకుంటానమి వెల్లడించారు. అయితే.. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.
Also Read: