Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder: తన కూతురిని బైక్‌తో ఢీకొట్టాడని.. ప్లాన్.. మాట్లాడుకుందామని చెప్పి.. తండ్రి ఘాతుకం..

Murder in jagadgiri Gutta: హైదరాబాద్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. యువకుడు బైక్‌తో తన కూతురును ఢీకొట్టాడని.. ఓ తండ్రి ఆ యువకుడిని

Murder: తన కూతురిని బైక్‌తో ఢీకొట్టాడని.. ప్లాన్.. మాట్లాడుకుందామని చెప్పి.. తండ్రి ఘాతుకం..
Brutal Murder
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 15, 2021 | 10:25 AM

Murder in jagadgiri Gutta: హైదరాబాద్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. యువకుడు బైక్‌తో తన కూతురును ఢీకొట్టాడని.. ఓ తండ్రి ఆ యువకుడిని కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది . రోడ్డుమీద ఆడుకుంటున్న చిన్నారిని అటుగా వెళ్తున్న జావేద్ అనే వ్యక్తి బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో పాపకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పాప తండ్రి శ్రీహరికి.. జావేద్‌ మధ్య మాటా మాటా పెరిగింది. ఇద్దరు కూడా రోడ్డు మీద వాగ్వాదానికి దిగి ఘర్షణపడ్డారు.

మధ్యాహ్నం జరిగిన ఈ రోడ్డు ప్రమాదం అనంతరం స్థానికులు ఇద్దరినీ సర్దిచెప్పి పంపించి వేశారు. సాయంత్రం సమయంలో మాట్లాడుకుందామని చెప్పి శ్రీ హరి జావేద్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. అనంతరం కొద్ది దూరం వెళ్లిన తర్వాత శ్రీ హరి జావేద్ పై కత్తితో దాడి చేశాడు. తన కూతురికి గాయాలు కావడంతో జావిద్ పై శ్రీహరి కసి పెంచుకున్నాడు. జావేద్ పై శ్రీహరి దాడి చేస్తున్న ఈ విషయాన్ని వెంటనే స్థానికులు గమనించారు అడ్డుకునే లోపే పలు మార్లు.. కత్తితో దాడి చేశారు.

అనంతరం శ్రీహరి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న జావేద్ ను స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై స్థానికుల నుంచి పలు వివరాలు సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Gourd Juice Side Effects : పొట్లకాయ రసంతో డేంజర్..! తాగే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

డెల్టా వేరియంట్ ఎఫెక్ట్……ఆ నగరంలో మరో నెల పాటు ఆంక్షల పొడిగింపు….ప్రధాని బోరిస్ జాన్సన్