Hyderabad: ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో అప్‌డేట్.. కీలక సమాచారం వెల్లడించిన పోలీసులు.
హైదరాబాద్ ఆదిభట్లలోని మన్నెగూడాలో జరిగిన యువతి కిడ్నాప్ వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పట్టపగలు దాదాపు వంద మందితో వచ్చి యువతిని కిడ్నాప్ చేసిన ఉదాంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది...
హైదరాబాద్ ఆదిభట్లలోని మన్నెగూడాలో జరిగిన యువతి కిడ్నాప్ వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పట్టపగలు దాదాపు వంద మందితో వచ్చి యువతిని కిడ్నాప్ చేసిన ఉదాంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ కేసును పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. యువతి కిడ్నాప్ అయిన గంటల వ్యవధిలోనే అమ్మాయిని అధికారులు కాపాడారు. శుక్రవారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన వైశాలిని కిడ్నాపర్లు నల్గొండ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. ఇదిలా ఉండే దీని వెనకాల ఉన్న కీలక సూత్రదారి నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. అతన్ని అరెస్ట్ చేయలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
ఈ కేసుకు సంబంధించిన తాజాగా రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు పలు కీలక విషయాలను వెల్లడించారు. మన్నెగూడా కిడ్నాప్ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని తెలిపిన సుధీర్ బాబు అమ్మాయిని రెస్క్యూ చేశామని వివరించారు. వైశాలిని నిందితులు కొట్టి, భయపెట్టారని ప్రస్తుతం ఆమె షాక్‌లో ఉందని, కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేదని తెలిపారు. కిడ్నాప్ అయిన ఆరు గంటల్లో అమ్మాయిని రెస్క్యూ చేశామన్నారు. ఇది పక్కాగా ప్లాన్ చేసిన కిడ్నాప్ అని, అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత భయపెట్టారన్నారు. ఇక నవీన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదని తెలిపిన సీపీ.. అతని కోసం టీమ్స్ వెతుకుతున్నాయని తెలిపారు. దొరికిన నిందితులను విచారించి మిగతా వాళ్లని వీలైనంత త్వరగా పట్టుకుంటామని తెలిపారు.
అసలేం జరిగిందంటే..
ఆదిభట్లలోని మన్నెగూడకు చెందిన ఓ యువతి బీడీఎస్ పూర్తి చేసింది. ఆమెకు తాజాగా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆమె పేరెంట్స్ పెళ్లి చూపులు నిర్వహించారు. దీంతో నవీన్ రెడ్డి అనే యువకుడు సుమారు వంద మందితో వచ్చి యువతి ఇంటిపై దాడి చేశారు. అనంతరం యువతిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..