Hyderabad: కిడ్నాపైన ఆదిభట్ల యువతి క్షేమం.. నవీన్‌రెడ్డితో పాటు మరో ముగ్గురి అరెస్ట్
తాను సేఫ్‌గా ఉన్నట్టు తండ్రికి కిడ్నాపైన యువతి ఫోన్ చేసింది. మన్నెగూడలో ఉన్నట్టు ఫోన్లో చెప్పడంతో.. లొకేషన్‌కు వెళ్లిన పోలీసులు.. నవీన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
సంచలనం రేపిన ఆదిభట్ల కేసులో లేటెస్ట్ ట్విస్ట్ చోటుచేసుకుంది. డాడీ ఐయామ్ సేప్..అనే పిలుపు ఫోన్ ద్వారా రానే వచ్చింది. కిడ్నాప్ క్రైమ్ కథా చిత్రానికి శుభం కార్డ్ వేశారు రాచకొండ పోలీసులు. యువతి క్షేమంగా ఉంది. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి సహా మరికొందర్ని మన్నెగూడలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉత్కంఠకు తెరపడింది. కానీ డేలాంగ్ జరిగిన సినిమాటిక్ సీన్లు ఇప్పటికీ రీళ్లు తిరుగుతునే ఉన్నాయి. ఇంతకీ కిడ్నాప్ స్కెచ్ వెనుక అసలు కతేంటి? రచ్చ ముగిసింది.కానీ ఈ కేసులో ఇంకెన్ని సంచనాలు తెరపైకి రానున్నాయనేది చర్చగా మారింది.
శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మందకు మందలా వచ్చారు.. ఉరుములా ఇంటి మీద పడ్డారు… రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లినట్టు ఈ అసుర మూక ఇల్లంత విధ్వంసం చేసి.. పట్టపగలు ..పబ్లిక్‌గా యువతిని కిడ్నాప్ చేసి ఇదిగో ఇలా కారులో తుర్రుమన్నారు నవీన్ రెడ్డి అండ్ గ్యాంగ్. కళ్లెదుట బిడ్డను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే నిస్సహాయతో ఆ పేరెంట్స్ తల్లడిల్లపోయారు. వారి చేతుల్లోని రాడ్లు, కర్రలు చూసి ఎవ్వరూ ముందుకు వెళ్లే సాహసం చేయలేకపోయరు. నవీన్ రెడ్డి…పక్కా పథకంతోనే అటాక్‌కు స్కెచ్చేశాడు. యువతి ఎంగేజ్‌మెంట్ వుందని తెలిసి సినీఫక్కీలో వందలమందితో దాడి చేసి టెర్రర్ సృష్టించాడు. ఈ భీభత్సాన్ని తనే స్వయంగా లీడ్ చేశాడు. యువతి తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. తమ కుమార్తెతో పెళ్లికి నిరాకరించినందుకే ఇలా చేశాడని వాపోయారు యువతి పేరెంట్స్.
అతనితో సంబంధం కుదరదని ఖరాకండిగా చెప్పినా సరే..నవీన్‌రెడ్డి తన విలనిజంతో విధ్వంసానికి దిగాడు. ఇంట్లో వాళ్లను కొట్టి..అడ్డొచ్చిన వాళ్లను చితకబాది సినిమాటిక్ విలనిజాన్ని చూపారంటే ఏ ధైర్యంతో ఇంత బరితెగింపు.. వచ్చిందా..వంద మందా..అంతకు మించా..లెక్క ఎంతన్నది పక్కన పెడితే.. కరోనా టైమ్‌లో మాస్క్ పెట్టారో లేదో కానీ అటాక్ సీన్‌లో ప్రతీ ఒక్కడి ముఖానికి మాస్క్ వుంది. అంటే ఇదంతా ప్రీ ప్లాన్ చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు.
ఓ వైపు గాయాలు.. కోలుకోలేనంత బీభత్సం..మరోవైపు బిడ్డ ఎలా వుందోననే ఆవేదన.. బంధుమిత్రులు, స్థానికులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. సాగర్ హైవే పై ఆందోళనకు చేపట్టారు. నవీన్‌రెడ్డి ఆగడాలపై గతంలోనే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అప్పుడే పోలీసులు సరైన చర్యలు తీసుకుని వుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేదా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి. మొత్తంగా యువతి సేఫ్‌గా ఉండడంతో అందరూ తేరుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..