Revanth Reddy: కేసీఆర్‌కు తెలంగాణ పేగు బంధం తెగిపోయింది.. బీఆర్ఎస్ ఏర్పాటుపై రేవంత్ ఫైర్..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలపాలనే నేతల మాటలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ప్రతిపాదన తెర పైకి వస్తే అంగీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ...

Revanth Reddy: కేసీఆర్‌కు తెలంగాణ పేగు బంధం తెగిపోయింది.. బీఆర్ఎస్ ఏర్పాటుపై రేవంత్ ఫైర్..
Revanth Reddy
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 09, 2022 | 6:27 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలపాలనే నేతల మాటలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ప్రతిపాదన తెర పైకి వస్తే అంగీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయనతో పాటు ఆ రాష్ట్రానికే చెందిన మంత్రులు, నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతుండటం గమనార్హం. అయితే వారి కామెంట్లకు తెలంగాణ నేతలు దీటుగా స్పందిస్తున్నారు. ఇలా మాట్లాడడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసినట్లు అవుతోందని మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణను ఏపీలో కలిపేందుకు సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఏమాత్రం స్పందించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర మనుగడను గుర్తించడానికి కూడా సీఎం కేసీఆర్ అంగీకరించడంలేదని అసహనం వ్యక్తం చేశారు.

సజ్జల చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉంది. ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగింది. ప్రజలకు కేసీఆర్ చేస్తున్న ద్రోహం ఇది. నిజంగా తెలంగాణ సమాజానికి బ్లాక్ డే అవుతుంది. మేధావులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలి. సీఎం కేసీఆర్‌ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఈ రోజు నుంచి కేసీఆర్‌కు తెలంగాణ పేగు బంధం తెగిపోయింది. బీజేపీకి సహకరించడానికే బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే బీఆర్ఎస్ లక్ష్యం.

– రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

కాగా.. సమైక్య రాష్ట్రంపై సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ విధానం అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్‌ ఎప్పుడూ ముందుంటారని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రాన్ని వైసీపీనే గట్టిగా కోరుకుందని గుర్తు చేశారు. తాము ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రానికే మద్దతు ఇస్తామన్నారు. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే తమ విధానం స్పష్టం చేశారు సజ్జల. ఆంధ్రప్రదేశ్ మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ పార్టీ, తమ ప్రభుత్వం దానికే ఓటు వేస్తుందని ప్రకటించారు. కానీ, ఇప్పుడది సాధ్యమయ్యే పనేనా అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం గమనార్హం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..