YS Sharmila: రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ప్రమాణం చేసి చెప్తున్నా.. నాకు ఏ పార్టీ తో సంబంధం లేదు..

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్టీపీ హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయం తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ పార్టీ ఆ రకంగానే ప్రణాళికలు వేస్తోంది. ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాద యాత్ర...

YS Sharmila: రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ప్రమాణం చేసి చెప్తున్నా.. నాకు ఏ పార్టీ తో సంబంధం లేదు..
Ys Sharmila
Follow us

|

Updated on: Dec 09, 2022 | 5:25 PM

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్టీపీ హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయం తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ పార్టీ ఆ రకంగానే ప్రణాళికలు వేస్తోంది. ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాద యాత్ర చేస్తూ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ వదిలిన బాణం అని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. బీఆర్ఎస్ వదిలిన బాణం అని బీజేపీ నేతలు చెబుతున్నారు. తాజాగా వీటిపై ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెస్పాండ్ అయ్యారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని.. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని కుండబద్ధలు కొట్టారు. తనకు రాష్ట్రంలోని ఏ పార్టీ తో దోస్తానీ లేదని స్పష్టం చేశారు. “రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ప్రమాణం చేసి చెప్తున్నా. దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో ఉన్న పార్టీలతో కూడా సంబంధం లేదు. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యనే దోస్తానీ ఉంది. బండి సంజయ్ యాత్ర కి అనుమతి ఇచ్చి.. నాకు ఎందుకు ఇవ్వరు…[. నా బిడ్డలపై ప్రమాణం చేసి చెప్తున్నా.. నాకు ఏ పార్టీ తో సంబంధం లేదు” అని వైఎస్. షర్మిల వివరించారు.

కాగా.. తెలంగాణలో తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.. వైఎస్. షర్మిల ట్యాంక్‌బండ్‌ వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. ప్రజా సమస్యలపై మాట్లాడేవారి గొంతు నొక్కేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని సీఏం కేసీఆర్‌ ఖూనీ చేస్తున్నారని, నియంత పాలనకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు. పాదయాత్ర కు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం దీక్ష చేపట్టగా.. పోలీసులు భగ్నం చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆమె కాన్వాయ్ పై దాడి చేసిన దుండగులు.. పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు ధ్వంసమైన కారులోనే నిరసన తెలిపేందుకు ప్రగతి భవన్ కు బయల్దేరారు. సమాచారం అందుకున్న పోలీసులు దారి మధ్యలో ఆమెను అడ్డుకున్నారు. కారు దిగేందుకు షర్మిల నిరాకరించగా క్రేన్ సహాయంతో కారును పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. అనేక నాటకీయ పరిస్థితుల తర్వాత తెలంగాణ హైకోర్టు ఆమె పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. అయితే పోలీసులు నిరాకరించడంతో ఆమె దీక్ష చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..