అనంతపురం జిల్లాలో పూజారుల మధ్య ఫైటింగ్… ఎండోమెంట్ అధికారులు సమక్షంలోనే

పూజలు మావంటే మావన్నారు... భూములు మాకంటే మాకు అన్నారు.. వచ్చే కానుకలు... మాకే చెందాలంటే.. మాకు కావాలని డిమాండ్‌ చేశారు..

అనంతపురం జిల్లాలో పూజారుల మధ్య ఫైటింగ్... ఎండోమెంట్ అధికారులు సమక్షంలోనే
Preistes Fight
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 22, 2021 | 9:59 PM

పూజలు మావంటే మావన్నారు… భూములు మాకంటే మాకు అన్నారు.. వచ్చే కానుకలు… మాకే చెందాలంటే.. మాకు కావాలని డిమాండ్‌ చేశారు.. దీంతో మాటా మాటా పెరిగి.. కొట్టుకునే వరకు వెళ్లింది. ఇంతకీ ఈ గోల ఎక్కడైందో.. తెలుసుకుందాం పదండి.

పూజారులూ.. పూజారులూ తన్నుకున్నారు.వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది. అనంతపురం జిల్లా తొండపాడులో జరిగిన ఈ వివాదం ఇప్పుడు జిల్లాలో ట్రెండింగ్ టాపిక్‌. బోలికొండ రంగనాథ స్వామి ఆలయంలో ఎండోమెంట్ అధికారులు సమక్షంలో ఓ సమావేశం కొనసాగుతోంది. అందులో ఆలయానికి సంబంధించిన భూముల పంపకాలు, వంతుల వారీగా పూజల నిర్వహణ వంటి వాటిపై చర్చ జరుగుతూ ఉంది. మేమంటే మేమంటూ పూజారుల్లో రెండు వర్గాలు మాటామాట పెంచుకుంటూ పోయాయి. నువ్వెంతరా అంటే నువ్వెంత, మీరేం చేస్తార్రా అంటే మీరేం చేస్తారంటూ సీరియస్ అయ్యారు. అదికాస్తా కొట్టుకునే వరకూ వెళ్లింది. ఇక ఆ మధ్యలోనే పరమ బూతులు కూడా వినిపించాయి. చాలాసేపు ప్రయత్నిస్తే తప్ప వాళ్లను సముదాయించడం దేవాదాయ శాఖ అధికారుల వల్లకాలేదు. చివరికి ఏమీ చేసేది లేక మీటింగ్‌కు బైబై చెప్పేసి వెళ్లిపోయారు అధికారులు. అంతా అయ్యాక.. ఒక వర్గంపై మరో వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే పూజారులు ఇలా కొట్టుకోవడం చూసి ఆలయాలకు వెళ్లే భక్తులు అవాక్కవుతున్నారు. దేవుడి దగ్గర సేవలో ఉండే పూజారులు, అర్చకులు ఇలా చేయడం సరికాదంటున్నారు. పూజారులు ఇలా కొడ్డుకోవడం సమాజంలోకి తప్పుడు సంకేతాలు పోతాయంటున్నారు కొందరు భక్తులు. ఇలాంటి గొడవలు తగ్గించి ఒకరినొకరు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.

Also Read:  చేతబడి చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.. ఘటనాస్థలంలో చనిపోయిన పందిపిల్ల.. ట్విస్ట్ ఏంటంటే..?

తల్లిదండ్రులూ.. మీ పిల్లల్ని ఆడుకోడానికి బయటకు వదులుతున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త..

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే